అభిమానులు నచ్చే కథ కాదు.. అవార్డు తెచ్చే కథ కావాలి..?
ఐతే ఈ హీరోలు అభిమానులకు నచ్చే సినిమాలు చేస్తున్నారు తప్ప అవార్డ్ విన్నింగ్ కథలను చేయట్లేదని కొందరి టాక్.
By: Tupaki Desk | 13 May 2025 12:00 AM ISTస్టార్ హీరోలు ఎప్పుడు కూడా వారి ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా స్టార్ సినిమా అభిమానులకి ఎక్కితే చాలు అది బ్లాక్ బస్టర్ అయినట్టే అనే ఆలోచనలో ఉంటారు. అది కొంతవరకు నిజమే అయినా అన్ని సినిమాలకు అది కుదరదు. అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా సూపర్ అనిపించేలా చేస్తే అప్పుడు ఆ సినిమా అసలు సిసలు బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. ఐతే స్టార్ సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వడం కామనే.. కానీ అవార్డ్ ల విషయంలో కాస్త వెనకపడి ఉంటున్నాయి. ముఖ్యంగా జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా ఇంకా ఎక్కడో ఉంది.
పుష్ప 1 వల్ల ఎలానో అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. దాదాపు 80 ఏళ్ల పైన ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోవడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. ఐతే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ రావడంతో ఇప్పుడు ఆ అవార్డ్ మీద మిగతా స్టార్స్ కన్నేశారు. అంటే అవార్డ్ అనుకుంటే వస్తుంది అనుకుంటే పొరపడినట్టే.
అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ఇద్దరిలో ఒకరికి నేషనల్ అవార్డ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్ప తర్వాత వచ్చిన ఎన్ టీ ఆర్ దేవర 1 ఫ్యాన్స్ కి నచ్చింది. RRR తర్వాత ఆచార్య చేసిన చరణ్ ఆ నెక్స్ట్ గేమ్ ఛేంజర్ చేశాడు. ఐతే ఈ హీరోలు అభిమానులకు నచ్చే సినిమాలు చేస్తున్నారు తప్ప అవార్డ్ విన్నింగ్ కథలను చేయట్లేదని కొందరి టాక్. కాంతారా లాంటి కథ ఎన్టీఆర్ లాంటి హీరో చేసి ఉంటే రిషబ్ శెట్టికి ఏమాత్రం తక్కువ కాకుండా చేసేవాడని మన తెలుగు ప్రేక్షకుల నమ్మకం.
రంగస్థలం టైంలోనే రామ్ చరణ్ నటనకు కచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తుందని అనుకున్నాం. ఇలా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అలా రక్తికట్టించే పాత్రలతో రావాలని స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. స్టార్ ఫ్యాన్స్ వాళ్లు ఎలాంటి సినిమా తీసినా ఆదరిస్తారు. కానీ తెలుగు పరిశ్రమకు మరో నేషనల్ అవార్డ్ వచ్చే కథల మీద దృష్టి పెడితే బాగుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రమే కాదు ప్రభాస్, మహేష్ ఇలా ప్రతి ఒక్కరు కొడితే అవార్డ్ వచ్చి పడే రేంజ్ కథలను పాత్రలను చేయాలని చెబుతున్నారు.
