Begin typing your search above and press return to search.

స్పాట్‌లోనే వంట‌శాల‌.. టాలీవుడ్‌లో న‌యా ట్రెండ్

ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ, ఫిట్నెస్ కోసం జిమ్ యోగా మెడిటేష‌న్ వంటి విద్య‌ల్ని అనుస‌రిస్తే జీవితాంతం ఆరోగ్యంగా జీవించ‌గ‌లం.

By:  Tupaki Desk   |   24 April 2025 11:12 AM IST
Telugu Stars Embrace Healthy Living with On-Site Cooking and Fitness Routines
X

ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ, ఫిట్నెస్ కోసం జిమ్ యోగా మెడిటేష‌న్ వంటి విద్య‌ల్ని అనుస‌రిస్తే జీవితాంతం ఆరోగ్యంగా జీవించ‌గ‌లం. కానీ నేటి బిజీ లైఫ్ లో ఇవ‌న్నీ పాటించ‌డం సాధ్య‌ప‌డ‌టం లేదు. కానీ కొంద‌రు మాత్ర‌మే క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన లైఫ్ స్టైల్‌తో త‌మ‌కు కావాల్సిన జీవితాన్ని సాధించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు సినీప్ర‌ముఖులు ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న శైలిని అనుస‌రించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అంద‌రికీ స్ఫూర్తినిస్తున్నాయి.

ఇంత‌కుముందు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార నియ‌మాల‌ను అనుస‌రించేందుకు, అలాగే సొంతంగా వండిన ఫుడ్ ని తినేందుకు తాము ప్రాధాన్య‌త‌నిస్తామ‌ని ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. చ‌ర‌ణ్ ఎక్క‌డ ఉన్నా త‌న ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం. అందుకే త‌న కోసం స్పాట్ లో వంట‌కాలు రెడీ అవుతాయి. వండేందుకు అవ‌స‌ర‌మైన కుక్క‌ర్, గ్యాస్ స్టౌ, వంట ఉప‌క‌ర‌ణాలు, ఇత‌ర వ‌స్తువులు స‌హా ప్ర‌తిదీ అందుబాటులో ఉంటాయ‌ని ఉపాస‌న‌ తెలిపారు. చిరంజీవి- సురేఖ దంప‌తులు దీనిని అనుస‌రిస్తారు. అత్త‌మ్మ విలువైన స‌ల‌హాలు సూచ‌న‌ల‌ను కోడ‌లు ఉపాస‌న కొణిదెల పాటిస్తున్నారు.

ఇప్పుడు ఇదే బాట‌లో సీనియ‌ర్ న‌రేష్- ప‌విత్ర జంట కూడా ఆన్ ది స్పాట్ కుకింగ్ కోసం ఒక సెట‌ప్ ని ఏర్పాటు చేసుకోవ‌డం విశేషం. ఈ జంట త‌మ‌తో పాటే కిచెన్ కిట్ ని తీసుకుని వెళుతుంది. ఇది చాలా బ‌రువైన కిట్. ఇందులో వంట‌కాల‌కు సంబంధించిన సామాగ్రి అంతా అందుబాటులో ఉంటుంది. కిచెన్ కిట్‌లో ఇండక్షన్ స్టవ్, మల్టీపర్పస్ కుక్కర్, మినీ మిక్సీ, సుగంధ ద్రవ్యాలు, గోధుమ పిండి, బియ్యం ప్ర‌తిదీ ఉంటాయి. ఆరోగ్య‌క‌ర‌మైన జీవన శైలికోసం 50ప్ల‌స్ వ‌య‌సులో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటున్న న‌రేష్ ప్ర‌తిరోజూ వ్యాయామం చేస్తారు. వాకింగ్ కి, శ్వాస వ్యాయామాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తారు. న‌రేష్ వెంటే ఉండి ఆయ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో జీవిత భాగ‌స్వామి ప‌విత్ర ఎంతో స‌హ‌కారిగా ఉన్నారు.