2026 జూలై వరకు రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తెలుగు చిత్రాలు!
అలా 2026 జనవరి ప్రారంభం నుండి జూలై వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో ప్రత్యేకించి తెలుగు చిత్రాలు రూ.100కోట్ల క్లబ్లో చేరి ఆకట్టుకున్నాయి.
By: Madhu Reddy | 2 Aug 2026 5:23 PM ISTఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయి l. అలా 2026 జనవరి ప్రారంభం నుండి జూలై వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో ప్రత్యేకించి తెలుగు చిత్రాలు రూ.100కోట్ల క్లబ్లో చేరి ఆకట్టుకున్నాయి. అలా ఈ ఏడాది జులై వరకు విడుదలైన చిత్రాలలో.. ప్రత్యేకించి రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఆ తెలుగు చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మన శంకర వరప్రసాద్ గారు..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా , విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడమే కాదు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది . చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. అంతేకాదు ప్రాంతీయ చిత్రాలలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రూ.100 కోట్ల జాబితాలో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
అనగనగా ఒక రాజు:
చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా.. ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అనగనగా ఒక రాజు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా.. మారి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా రూ.100.2 కోట్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
పెద్ది:
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, ప్రేక్షకుల ముందుకు జూన్ 4వ తేదీన వచ్చిన చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.పైగా రూ.400 కోట్లకు క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది.
మా ఇంటి బంగారం..
చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా చేసి ప్రేక్షకులను అలరించిన సమంత.. దాదాపు మూడేళ్ల పాటు విరామం తీసుకుని.. మా ఇంటి బంగారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మించిన ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు తెలుగులో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన మొదటి ఉమెన్ సెంట్రిక్ సినిమాగా కూడా రికార్డు సృష్టించింది.
లెనిన్:
దశాబ్ద కాలానికి పైగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం కోసం ఎదురుచూసిన అఖిల్ చివరిగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్ల పడ్డారు. ఇప్పుడు మూడేళ్లు గ్యాప్ తీసుకొని లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూలై 10వ తేదీన విడుదలైన ఈ సినిమా కూడా రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. మనం ఎంటర్టైన్మెంట్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించారు. అలా మొత్తానికైతే ఈ ఏడాది ఇప్పటివరకు రూ.100 కోట్ల క్లబ్లో చేరి తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చాటాయి.
ది రాజా సాబ్:
ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ది రాజా సాబ్. ప్రభాస్ కెరియర్ లో తొలి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ తో పాటు మాళవిక మోహనన్ కూడా హీరోయిన్ గా నటించింది ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.206 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసినట్లు సమాచారం .
