Begin typing your search above and press return to search.

థియేటర్లకు మళ్లీ పిలిచే టెక్నిక్.. ఇదే అసలు గేమ్!

ఈ కలెక్షన్ రాబట్టటం అనేది 2013లో 'మిర్చి' సినిమాతో కొరటాల శివ గారు ఒక పక్కాప్లాన్ గీశారు.

By:  Madhu Reddy   |   1 May 2026 1:00 AM IST
థియేటర్లకు మళ్లీ పిలిచే టెక్నిక్.. ఇదే అసలు గేమ్!
X

సినిమా రిలీజ్ రోజే వందలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి చూసేస్తాం. తీరా వారం అయ్యాక ప్రొడ్యూసర్ వచ్చి "కొత్త సీన్లు యాడ్ చేశాం.. మళ్ళీ రండి" అంటే ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఇవి థాంక్స్ గివింగ్ లా ఉండేవి, కానీ ఇప్పుడు ఇవి పక్కా బిజినెస్ స్కెచ్‌లు. మిర్చి నుండి రీసెంట్ రాజా సాబ్ వరకు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పిండడానికి మేకర్స్ వాడుతున్న ఈ ఇంట్రెస్టింగ్ యాడెడ్ సీన్స్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం.

ఒకప్పటి సెలబ్రేషన్.. ఇప్పటి బిజినెస్:

పూర్వం సినిమాల్లో సీన్లు యాడ్ చేయడం అంటే ఒక పండుగలా ఉండేది. వెంకటేష్ గారి 'చంటి', 'ప్రేమించుకుందాం రా' వంటి సినిమాలు 50 రోజులు ఆడాక, ఆ సంతోషంలో ప్రేక్షకులకు గిఫ్ట్ గా సాంగ్స్ లేదా కామెడీ సీన్స్ కలిపేవారు. అది ఆడియన్స్‌కి చెప్పే థాంక్స్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా హిట్ అయితే కలెక్షన్లను బూస్ట్ చేయడానికి, ఫ్లాప్ అయితే నెగిటివ్ టాక్ కవర్ చేయడానికి ఈ 'యాడెడ్ సీన్స్' అనే బాంబు పేలుస్తున్నారు.

మిర్చి' వేసిన మాస్టర్ ప్లాన్:

ఈ కలెక్షన్ రాబట్టటం అనేది 2013లో 'మిర్చి' సినిమాతో కొరటాల శివ గారు ఒక పక్కాప్లాన్ గీశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక, నెల రోజుల తర్వాత సడన్ గా 'రైన్ ఫైట్' యాడ్ చేశారు. టెక్నికల్ ఇష్యూ అని కవర్ చేసినా, అసలు ప్లాన్ ఏంటంటే.. మాస్ ఆడియన్స్‌ని మళ్ళీ థియేటర్లకు రప్పించడం. ఆ ఒక్క ఫైట్ కోసం జనాలు మళ్ళీ ఎగబడ్డారు, దీంతో 50 రోజుల రన్ ఈజీ అయిపోయింది. ఆ సీన్ కూడా సూపర్ గా ఉంటుంది అదేదో మొదటిలోనే సినిమాలో ఉంటే ,2000 రూపాయలు పెట్టి టికెట్ కొన్న వాళ్లకు కాస్త సంతోషం ఉండేది.

రికార్డుల వేటలో 'అత్తారింటికి దారేది':

ఇదే ఏడాది పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' మరో రికార్డ్ సృష్టించింది. ఓ హీరో రికార్డులను క్రాస్ చేయాలనే టార్గెట్‌తో, ఐదో వారంలో 'అహల్య' డ్రామా ఎపిసోడ్‌ను యాడ్ చేశారు. కేవలం ఆ 6 నిమిషాల కామెడీ కోసం జనాలు మళ్ళీ టికెట్లు కొన్నారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత కొరటాల గారు 'శ్రీమంతుడు'లో కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయి నాన్-బాహుబలి రికార్డును సాధించారు. ఇలా చేపూకుంటూ పొతే చాల సినిమాలే వున్నాయి.

లేటెస్ట్ 'రాజా సాబ్' వరకు ఇదే ట్రెండ్రీ :

ఇక రీసెంట్ గా 2026 జనవరిలో వచ్చిన 'ది రాజా సాబ్' విషయంలోనూ ఇదే జరిగింది. ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్ అయిందని ఫ్యాన్స్ ఫీలవ్వడంతో, మేకర్స్ వెంటనే అలర్ట్ అయ్యి ఒక 8 నిమిషాల సీక్వెన్స్‌ని యాడ్ చేశారు. అంతకుముందు 'పుష్ప'లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్, 'అజ్ఞాతవాసి'లో వెంకటేష్ గారి క్యామియో సీన్ యాడ్ చేయడం వంటివన్నీ ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్ కు రప్పించే 'కమర్షియల్' టెక్నిక్లే.

ఇక ఫస్ట్ డే 2000 పెట్టి చూసిన అభిమాని, వారం తర్వాత కొత్త సీన్ వచ్చిందని తెలిసి మళ్ళీ వెళ్లాల్సి రావడం ఒక రకమైన మానసిక ఒత్తిడే. డైరెక్టర్ విజన్ కోసం ఎక్స్టెండెడ్ కట్స్ రిలీజ్ చేస్తే అది ఆర్ట్, కానీ కేవలం కలెక్షన్ల కోసమే వారం వారం సీన్లు మార్చడం అనేది పక్కా బిజినెస్ గేమ్. ఈ గేమ్ లో ఫ్యాన్స్ ఎమోషన్స్ తో పాటు వారి జేబులు కూడా ఖాళీ అవుతున్నాయి అన్నది కొందరి వాదన.

సినిమా అంటే వినోదం.. కానీ అది వ్యాపారంగా మారినప్పుడు ఇలాంటి ఎత్తుగడలు తప్పవు. ఒకప్పుడు సెలబ్రేషన్ గా ఉన్న 'యాడెడ్ సీన్స్' కల్చర్, ఇప్పుడు 'కలెక్షన్ ప్లాన్' గా మారిపోయింది. మరి మేకర్స్ వేసే ఈ స్కెచ్‌లకు ప్రేక్షకులు ఇంకెన్నాళ్లు బలైపోతారో చూడాలి. ఇక ఏదేమైనా థియేటర్లలో కొత్త సీన్ చూడాలనే కుతూహలం మాత్రం ఆడియన్స్‌ను మళ్ళీ మళ్ళీ క్యూ కట్టేలా చేస్తూనే ఉంది!