Begin typing your search above and press return to search.

తప్పంతా కోలీవుడ్ డైరెక్టర్స్ దేనా? మన హీరోలది ఏం లేదా?

ఇక్కడ వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయేసరికి.. కోలీవుడ్ కు వెళ్ళి హీరోలను తెచ్చుకుంటున్నారు. అందులో తెలుగు డైరెక్టర్స్ తప్పేం లేదు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 4:07 PM IST
తప్పంతా కోలీవుడ్ డైరెక్టర్స్ దేనా? మన హీరోలది ఏం లేదా?
X

తమిళ హీరోలకు తెలుగు డైరెక్టర్స్ సూపర్ హిట్స్.. కానీ తెలుగు హీరోలకు తమిళ డైరెక్టర్స్ డిజాస్టర్లు.. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆ విషయంపై ఎప్పటికప్పుడు చర్చలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా రిలీజ్ అయిన కుబేర మూవీ హిట్ అయిన నేపథ్యంలో అదే చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. నెటిజన్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే టాలీవుడ్ కథానాయకులకు ఇప్పటికే ఫ్లాపులు ఇచ్చిన అనేక మంది కోలీవుడ్ దర్శకుల వైపే మొత్తం తప్పంతా నెట్టేయొచ్చా? తెలుగు హీరోలది ఎలాంటి తప్పు ఉండడం లేదా? పాత్రలు, కథ ఎంపికలో సరిగ్గానే ముందుకు వెళ్తున్నారా? ఈ విషయంపై సినీ వర్గాలు ఏం చెబుతున్నాయి? ఓసారి డిస్కస్ చేసుకుందాం.

నిజానికి.. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి వంటి పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ తమిళ హీరోలతో వర్క్ చేసి సూపర్ హిట్స్ అందించారు. ఇప్పుడు కుబేర.. అప్పుడు సార్.. రెండు మూవీలు మంచి విజయాలు సాధించాయి. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టడమే కాకుంగా.. కంటెంట్ అండ్ స్టోరీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి ఆకట్టకున్నాయి.

అదే తెలుగు హీరోలతో పనిచేసిన తమిళ డైరెక్టర్లు.. ఎక్కువగా డిజాస్టర్లనే అందించారు. రీసెంట్ గా స్టార్ హీరో రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ తో భారీ ఫ్లాప్ ఇచ్చారు శంకర్. అంతకుముందు మహేష్ బాబు స్పైడర్, రామ్ ది వారియర్, నాగ చైతన్య కస్టడీ సహా పలు ప్రాజెక్టులతో తెలుగు హీరోలతోపాటు ఆడియన్స్ ను కూడా కోలీవుడ్ డైరెక్టర్స్ నిరాశపరిచారు.

అలా అని తప్పంతా తమిళ దర్శకులదేనని అనడం కరెక్ట్ కాదేమో. వారు తమ వర్క్ తో నిరాశపరచడం నిజమే. అదే సమయంలో తెలుగు హీరోల్లో చాలా మంది.. స్టోరీ అండ్ రోల్స్ ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని పాత్రలను ఒప్పుకోవడం లేదన్నది నిజమే. ఇప్పుడు కుబేర మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బిచ్చగాడిగా కనిపించారు.

ఇప్పుడు ఆ పాత్రను తెలుగు హీరోల్లో ఎవరైనా ఒప్పుకుంటారా అంటే డౌటే. కానీ ధనుష్ మాత్రం వెంటనే అంగీకరించారు. సినిమాలో తనదైన నటనతో మెప్పించారు. మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అసాధారణమైన పాత్రలను ప్రయత్నించడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ముందుకు రావడం లేదన్నది మాత్రం నిజం.

ఇక్కడ వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయేసరికి.. కోలీవుడ్ కు వెళ్ళి హీరోలను తెచ్చుకుంటున్నారు. అందులో తెలుగు డైరెక్టర్స్ తప్పేం లేదు. అయితే తెలుగు హీరోలు మాత్రం సేఫ్ జోన్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హైప్ ఎక్కువ క్రియేట్ చేసే పలువురు తమిళ డైరెక్టర్స్ ను ఎంచుకుని డీలా పడుతున్నారు.

అయితే తమిళ డైరెక్టర్స్ కూడా కథల పరంగా అప్డేట్స్ అవ్వాల్సిన సమయం వచ్చినా.. తెలుగు హీరోల రూట్ కూడా కాస్త మారాల్సిందే. యాక్షన్, స్కేల్ లేదా విజువల్స్ పరంగా కాకుండా.. కంటెంట్ తోపాటు భావోద్వేగ సంక్లిష్టతలో కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలనే చెప్పాలి. ఇప్పుడు కుబేర విషయంలో ధనుష్ అదే చేశారు.

అలా జరిగితేనే అంతా అనుకున్నట్లు జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. కాబట్టి కంటెంట్ లో బలం ఉంటే తప్పక ఆ పాత్రలను చేసే అవకాశాన్ని టాలీవుడ్ హీరోలు దక్కించుకోవడం బెటర్. అప్పుడు ఏ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ తో అయినా హిట్ అందుకోవడం ఖాయం!