ఈ ఏడాది ఆ హీరోల ఫ్యాన్స్‌కే నిరాశే
ఇండియన్ సినిమాలో తెలుగు సినిమా స్థాయి పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.
By: Tupaki Desk | 17 May 2025 4:00 PM ISTఇండియన్ సినిమాలో తెలుగు సినిమా స్థాయి పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న తరుణంలో షూటింగ్ కు, పోస్ట్ ప్రొడక్షన్‌కు, మిగిలిన వాటికీ చాలానే టైమ్ పడుతుంది.
ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ ప్రతీ సంవత్సరం సినిమాలు రిలీజ్ చేస్తున్న టాలీవుడ్ హీరో ఎవరంటే ప్రస్తుతం నాని ఒక్కడే ఉన్నాడు. మిగిలిన వారంతా భారీ సినిమాల్లో భాగమవడం వల్ల ఆ సినిమాలు పూర్తవడానికి చాలా టైమ్ పడుతుంది. అంత భారీగా నిర్మించిన సినిమాలకు రిలీజ్ డేట్ కూడా మంచిది కావాలి కాబట్టి రిలీజ్ డేట్ కోసం కూడా కొన్ని సినిమాలు లేటవుతున్నాయి. ఇలా వివిధ కారణాలతో తెలుగు స్టార్ హీరోలు 2025లో థియేటర్లకు రాలేకపోతున్నారు. మరి 2025లో థియేటర్ రిలీజ్ ను మిస్ అవుతున్న హీరోలెవరో చూద్దాం.
వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది రాజమౌళికి తప్ప ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ఆయనేమో ఆ సినిమా గురించి ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు. 2025లో మహేష్ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రాదు, 2026లో కూడా డౌటే. అంటే మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని బిగ్ స్క్రీన్ పై చూడ్డానికి చాలానే టైమ్ వెయిట్ చేయాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో పలు సినిమాలుండగా వాటిలో ముందు ఏ సినిమా వస్తుందనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ లో ఉన్న ప్రభాస్ త్వరలోనే తన సినిమాల డేట్స్ ను అనౌన్స్ చేయనున్నాడు. స్పిరిట్ సినిమాను మొదలుపెట్టాలని ప్రభాస్ కు ఎంత ఆశగా ఉన్నప్పటికీ, ఆ సినిమాను స్టార్ట్ చేయాలంటే ప్రభాస్ ముందు తన చేతిలో ఉన్న రాజా సాబ్, ఫౌజీలను పూర్తి చేయాల్సి ఉంది. చూస్తుంటే ఈ ఏడాది ప్రభాస్ నుంచి కూడా ఏ సినిమా ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ తర్వాత వార్2 సినిమాలో నటించాడు కానీ అది డైరెక్ట్ మూవీ కాదు. ఈ ఇయర్ వార్2 రిలీజవుతున్నప్పటికీ అది తెలుగు సినిమా కాదు, బాలీవుడ్ మూవీ. తెలుగులో కేవలం డబ్ అవుతుందంతే. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు కానీ అది ఈ ఏడాది రాదనేది మేకర్స్ స్పష్టం చేశారు. డ్రాగన్ నెక్ట్స్ ఇయర్ జూన్ లో రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
గత డిసెంబర్ లో పుష్ప2 తో ప్రేక్షకుల్ని పలకరించి గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను అట్లీతో చేయనున్న సంగతి తెలిసిందే. విజువల్ గ్రాండీయర్ గా రూపొందనున్న ఈ యాక్షన్ మూవీ అక్టోబర్ లో మొదలై 2027లో రిలీజ్ కానున్నట్టు సమాచారం. మధ్యలో త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేసినా ఈ ఇయర్ బన్నీ నుంచి సినిమా రావడం అసాధ్యమే.
ఇక ఆల్రెడీ ఈ ఇయర్ గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్ ను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ ఈ ఏడాదే పూర్తైనప్పటికీ సినిమా మాత్రం 2026లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
