బీటౌన్ డైరెక్టర్స్ తో.. ఇకనైనా జాగ్రత్తపడితే బెటర్!
టాలీవుడ్ లో ఎలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. చాలా మందికి మన హీరోలు సూపర్ ఛాన్స్ ఇస్తే చాలు.. సూపర్ హిట్స్ ఇస్తారు.
By: M Prashanth | 15 Aug 2025 2:51 PM ISTటాలీవుడ్ లో ఎలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. చాలా మందికి మన హీరోలు సూపర్ ఛాన్స్ ఇస్తే చాలు.. సూపర్ హిట్స్ ఇస్తారు. కొన్నిసార్లు అనుకున్నట్లు రిజల్ట్ రాకపోయినా నెక్స్ట్ సినిమాతో ఆకట్టుకోవాలని కసితో వర్క్ చేస్తారు. కచ్చితంగా హిట్ కొట్టి తీరాలనే టార్గెట్ తో మూవీస్ తీస్తారు.
అదే సమయంలో బాలీవుడ్ డైరెక్టర్స్ తో కూడా ఇప్పటికే పలువురు తెలుగు హీరోలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా తారక్ కూడా వార్-2లో నటించారు. కానీ ఇకనైనా నార్త్ డైరెక్టర్స్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాల్సిందేనని నెటిజన్లు సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందని చెబుతున్నారు.
వారితో వర్క్ తో చేయడం తప్పు కాదు కానీ, అన్ని విధాలుగా వర్కౌట్ అవుద్దని అనిపిస్తే యాక్ట్ చేయాలని అంటున్నారు. ముఖ్యంగా ట్రాక్ రికార్డు చూసుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. అక్కడ హీరోలు మన దర్శకుల కోసం వెయిట్ చేస్తుంటే.. హీరోలు మాత్రం అక్కడి డైరెక్టర్స్ తో మూవీ చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల.. ఇప్పుడు అనుకున్న స్థాయిలో రిజల్ట్ అందుకోవడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన జంజీర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ వార్-2 చిత్రాలను ఉదహరిస్తున్నారు.
అపూర్వ లఖియా డైరెక్ట్ చేసిన జంజీర్ తో చరణ్.. డిజాస్టర్ అందుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో పెద్దగా లేకపోయినప్పటికీ.. నార్త్ న్యూస్ పేపర్స్ లో ట్రోలింగ్ టైప్ లో ఆర్టికల్స్ కనిపించాయి. ఆ తర్వాత ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కొన్నారో తెలిసిందే.. వసూళ్లు బాగానే వచ్చినా రిజల్ట్ మాత్రం డిజాస్టరే.
ఇప్పుడు వార్-2 డిజాస్టర్ కానప్పటికీ.. సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఎలివేషన్స్ ఇచ్చినంత రేంజ్ లో సినిమా లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ డెబ్యూ అయినప్పుడు సెలక్షన్ సరిగ్గా ఉండాలని కొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి చరణ్, ప్రభాస్, ఇప్పుడు తారక్.. బాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసి మూల్యం చెల్లించుకున్నారనే చెప్పాలి.
