త్రిశంకు స్వర్గంలో సినీ ఇండస్ట్రీ.. కోర్టు వెళ్లే యోచన!
అటు తెలంగాణలోను, ఇటు ఏపీలోనూ కూడా తమ పరిస్థితి దిన దిన గండంగా మారిందని వాపోయారు.
By: Tupaki Desk | 25 May 2025 4:15 PM ISTతెలుగు సినీ రంగం త్రిశంకు స్వర్గంలో చిక్కుకుంది. చేతినిండా డబ్బులున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా.. సాగిలపడాల్సిన పరిస్థితి.. ఎంత ఆదాయం ఉన్నా.. అణిగిమణిగి వ్యవహరించా ల్సి పరిస్థితి. అంతేకాదు.. ఎవరు అధికారంలోకి వస్తే.. వారికి అనుకూలంగా వ్యవహరించాల్సి పరిస్థితి నెలకొంది. ఈ మాట ఎవరో చెప్పడం లేదు.. సీనియర్ సినీ నిర్మాత ఒకరు ఆఫ్ దిరికార్డుగా వ్యాఖ్యానించారు.
అటు తెలంగాణలోను, ఇటు ఏపీలోనూ కూడా తమ పరిస్థితి దిన దిన గండంగా మారిందని వాపోయారు. ఒకవైపు.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సహా.. నకిలీ రాయుళ్ల బెడదతో సినీ రంగం ఇప్పటికే కుదేలైందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. సినిమా హాళ్లు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా మూతబడ్డా యని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మాతలు సైతం నష్టాలు భరించలేక.. సాహసాలు చేయలేక పోతున్నారని ఆయన వెల్లడించారు.
''ఒకరకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ త్రిశంకు స్వర్గంలో ఉంది. `` అని ఆయన వెల్లడించారు. ఇప్పు డు ఉన్న పరిస్థితిలో ప్రభుత్వాలు సహకరించకపోతే.. ఇండస్ట్రీ మరింత దిగజారిపోతుందన్నారు. పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఇప్పుడు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టేనని ఆయన తెలిపారు. అయితే.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. వారిని మచ్చిక చేసుకునేందుకు ఇండస్ట్రీ వారిని కలవాలని చెప్పడం సముచితం కాదన్న ఆయన.. ప్రభుత్వాలకు.. ఇండస్ట్రీకి మధ్య ఉన్న సునిశిత బంధం బలోపేతం కావాలే తప్ప.. ఈగోలకు పోవడం సరికాదన్నారు.
ఇక, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ఏపీలో సినిమా హాళ్లపై తనిఖీలు ముమ్మరం అవుతాయని.. తద్వా రా.. ప్రభుత్వ ఆధిపత్యమే కనిపిస్తుందని.. ఇది మంచిది కాదన్నారు. అలాగని తప్పులు చేస్తే.. చూస్తూ ఉండమని కూడా తాము చెప్పబోమన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇండస్ట్రీకి కోర్టులు తప్ప.. మరోమార్గం లేదన్నది ఆయన నిశ్చిత అభిప్రాయంగా వెల్లడించారు. ''ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని.. రేపు మరో ప్రభుత్వాన్ని బతిమాలుకోవడం మా పనికాదు. ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలు తీయాలంటే.. కొంత వెసులుబాటు కావాలి`` అని తేల్చి చెప్పారు.
