స్టార్ డైరెక్టర్స్ ఆన్ డ్యూటీ.. పిక్చర్ అభి బాకీహై!
కాబట్టి ఒకరు ఫేడ్ అవుట్ అయ్యారని అనుకోవడానికి లేదు. ఒకరు వెలిగిపోతున్నారని సంబరాలు చేసుకోవడానికీ లేదు.
By: Tupaki Entertainment Desk | 8 Feb 2026 7:00 AM IST`నీకోసం` నుంచి `దూకుడు` వరకు సక్సెస్‌ఫుల్‌గా సాగిన శ్రీను వైట్ల కెరీర్ ఒక్కసారిగా తారుమారైంది. హిట్‌లు, సూపర్ హిట్‌లు, బ్లాక్‌బస్టర్లు చూసిన శ్రీను వైట్ల గత కొంత కాలంగా హిట్టు మాటే వినలేక సతమతమవుతున్నాడు. తను హిట్టు మాట విన పన్నెండేళ్లకు పైనే అవుతోంది. ఎంత ప్రయత్నించినా కాలం కలిసి రాకపోవడంతో డైరెక్టర్‌గా పెద్ద హీరోలు కూడా తనకు ముఖం చాటేయడం మొదలు పెట్టారు. రీసెంట్‌గా శర్వానంద్ తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తను నటించిన `నారీ నారీ నడుమ మురారి`కి స్క్రిప్ట్ విషయంలో సహకరించడంతో ఆ సినిమాకు ప్లాస్ అయి శర్వాకు మంచి విజయాన్ని అందించింది.
దీంతో శ్రీను వైట్లకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. రచ్చ సినిమాతో టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరాల్సిన డైరెక్టర్ సంపత్ నంది. కానీ ఆ క్రేజ్‌ని కొనసాగించేలేక ఇప్పటికీ రేసులో వెనకబడే ఉన్నాడు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి పదిహేనేళ్లు దాటుతున్నా ఇప్పటికీ టాప్ లీగ్ డైరెక్టర్ల జాబితాలో చేరలేక సతమతమవుతున్నాడు. శర్వాతో ఇప్పుడు `భోగి` మూవీ చేయబోతున్నాడు. దీంతో మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడా? అన్నది వేచిచూడాల్సిందే.
`గీత గోవిందం` మూవీతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన డైరెక్టర్ పరశురామ్. అయితే ఆ తరువాతే డామిట్ కథ అడ్డం తిరిగింది. నాగచైతన్యతో `నాగేశ్వరరావు` సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న పరశురామ్ అది పట్టాలెక్కే సమయానికి మహేష్ ఆఫర్ ఇచ్చాడని చైతూని పక్కన పెట్టి `సర్కారు వారి పాట` అంటూ భారీ సినిమాకు ప్రయత్నించాడు. ఎత్తుకుంది మంచి కాన్సెప్టే అయినా దాన్ని తెరపైకి తీసుకురావడంతో తడబాటుకు గురై ఫ్లాప్‌ని ఎదుర్కోవడమే కాకుండా చైతూ దగ్గర కూడా బ్యాడ్ అయ్యాడు.
దీంతో రెండేళ్లుగా మరో సినిమా లేని స్థితికి వచ్చి చేరాడు. అయితే ఇప్పడు తనకు హీరో సూర్య రూపంలో ఓ అవకాశం వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో దీన్ని పరశురామ్ తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇది సక్సెస్ అయితే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తాడు. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి `ఏజెంట్` సినిమాతో చాలా వరకు బ్యాడ్ అయ్యాడు. చెప్పిన కథకి చేసిన సినిమాకు సంబంధిం లేదని నిర్మాతే స్టేట్‌మెంట్ ఇవ్వడంతో సురేందర్‌రెడ్డి కెరీర్ ఇక ముగిసినట్టేనని అంతా అనుకున్నారు. అలాంటి టైమ్‌లో పవన్ కల్యాణ్ తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రామ్ తాళ్లూరి ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నాడు. హిట్ కాంబినేషన్ గా పేరున్న వక్కంతం వంశీ దీనికి స్టోరీ అందిస్తున్నాడు. దీంతో పైకి లేస్తాడా? మళ్లీ మ్యాజిక్ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
