సప్తగిరి ఇంట తీవ్ర విషాదం
సప్తగిరికి తీరని లోటు కలిగిందని, అతని తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు చిట్టెమ్మ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేస్తున్నారు.
By: Tupaki Desk | 9 April 2025 11:47 AM ISTతెలుగు సినిమా కమెడియన్, హీరో సప్తగిరి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ మంగళవారం నాడు కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా సప్తగిరే సోషల్ మీడియాలో వెల్లడించాడు.
బుధవారం రోజు తిరుపతిలో తన తల్లి అంత్యక్రియలు జరుగుతాయని చెప్తూ సప్తగిరి ఈ విషయాన్ని తెలిపాడు. సప్తగిరికి తీరని లోటు కలిగిందని, అతని తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు చిట్టెమ్మ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేస్తున్నారు.
ఆల్రెడీ కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన సప్తగిరి ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేయడం లేదు. హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్న సప్తగిరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ హీరోగా అతను చేస్తున్న ప్రయత్నాలేవీ అనుకున్న ఫలితాన్ని ఇవ్వడం లేదు. రీసెంట్ గా సప్తగిరి హీరోగా వచ్చిన పెళ్లి కాని ప్రసాద్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
ఇప్పటికే కమెడియన్ గా ప్రూవ్ చేసుకున్న సప్తగిరి సునీల్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్, సినిమాను నడిపించే పాత్రలు చేయాలని సంబరపడుతున్నాడు. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసే సత్తా తనకుందని, అందుకే అలాంటి పాత్రలేమైనా వస్తే చేసి నటుడిగా తనను తాను నిరూపించుకోవాలనుందని సప్తగిరి మొన్నామధ్య వెల్లడించిన సంగతి తెలిసిందే.
