Begin typing your search above and press return to search.

ఐపీఎల్‌లో తెలుగు సినిమాను చూపిస్తున్నారు..!

దేశ వ్యాప్తంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు మంచి ఆధరణ లభిస్తున్న విషయం తెల్సిందే. స్టేడియంలో ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 April 2025 3:00 PM IST
Telugu Cinema Takes Over IPL
X

క్రికెట్‌ అభిమానులు ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. సినిమాలను సైతం పక్కన పెట్టి క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. రెండు నెలల పాటు ఐపీఎల్‌ పండుగ క్రికెట్‌ అభిమానులకు వినోదాన్ని పంచుతున్న విషయం తెల్సిందే. ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ ద్వారా ఎంతో మంది కొత్త వారు, ముఖ్యంగా యువ క్రికెటర్స్ పరిచయం అవుతున్నారు. బుల్లి తెరపై, ఓటీటీలో ఐపీఎల్‌ను కోట్లాది మంది చూస్తున్నారు. సోషల్ మీడియాలో పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఐపీఎల్ ముచ్చట్లు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు మంచి ఆధరణ లభిస్తున్న విషయం తెల్సిందే. స్టేడియంలో ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఐపీఎల్‌ను సినిమాలతో కలిపి ఎంజాయ్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. స్టేడియంలో సినిమాలకు సంబంధించిన పాటలను ప్లే చేయడం ద్వారా చాలా మంది ఆస్వాదిస్తున్నారు. ఆ ప్లే అవుతున్న పాటల్లో ఎక్కువ శాతం సౌత్‌ సినిమాల పాటలు, మరీ ముఖ్యంగా తెలుగు పాటలు ఉంటున్నాయి. హిందీ పాటలతో పోల్చితే తెలుగు పాటలు స్టేడియంలో ఎక్కువగా మారు మ్రోగుతున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించిన పాటలు, ప్రముఖ సంగీత దర్శకులు ట్యూన్ చేసిన సౌత్ ఇండియన్ పాటలతో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న స్టేడియాలు మారుమ్రోగుతున్నాయి. అంతే కాకుండా సినిమాలకు సంబంధించిన ఇన్పుట్స్ చాలానే చూస్తూ ఉన్నాం.

ప్రముఖ బ్యాట్స్‌మెన్స్‌తో పాటు, కొత్త వారు ఎవరైనా తమ విజయాన్ని లేదా అరుదైన రికార్డ్‌ నమోదు చేసిన సమయంలో, ఇలా ప్రతి సందర్భంలోనూ సినిమాలోని హీరోల మ్యానరిజం ను ఉపయోగిస్తూ వేడుక చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పుష్ప 2 సినిమాలోని మేనరిజంను క్రికెటర్స్ ఎక్కువగా వినియోగిస్తున్న విషయం తెల్సిందే. సిక్స్ కొట్టినప్పుడు, వికెట్‌ తీసినప్పుడు ఇలా ఏదో ఒక సమయంలో పుష్ప యొక్క డైలాగ్‌ నీ అవ్వ తగ్గేదే లే అంటూ చెబుతూ మ్యానరిజంను యాక్ట్‌ చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. బాహుబలి సినిమాలోని ఐకానిక్ ఫోజ్‌తో పాటు ఇంకా చాలా తెలుగు సినిమాల్లోని ఐకానిక్ ఫోజ్‌లను క్రికెటర్స్ వినియోగించడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం.

స్టేడియంలో క్రికెటర్స్‌ తెలుగు సినిమా స్టార్‌ హీరోల మ్యానరిజంలు వినియోగిస్తే, కొందరు సోషల్‌ మీడియాలో హీరోల, కమెడియన్స్ మ్యానరిజంను ఉపయోగించి మీమ్స్ చేస్తున్నారు. మీమ్స్ క్రియేట్‌ చేయడం కోసం కూడా అధికంగా తెలుగు సినిమాలకు సంబంధించిన టెంప్లేట్స్ వినియోగించడం విశేషం. క్రికెటర్ పై విమర్శలు చేయాలన్నా తెలుగు సినిమా టెంప్లేట్స్, ప్రశంసలు కురిపించాలన్నా తెలుగు సినిమా టెంప్లేట్స్ వినియోగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా క్రికెట్‌కి ఆధరణ మరింత పెరుగుతున్న నేపథ్యంలో సినిమాలు అందులో భాగం అవుతున్నాయి. సినిమాల యొక్క టెంప్లేట్స్‌ను వినియోగించడం ద్వారా చాలా ఈజీగా తమ మీమ్స్ జనాల్లోకి వెళ్తాయని మీమ్‌ క్రియేటర్స్ భావిస్తున్నారు.