Begin typing your search above and press return to search.

'త‌మ్ముడు'తో ఇండ‌స్ట్రీలో అంద‌రి లెక్క‌లు మార‌తాయా?

తెలుగు సినిమా గురించి మాట్లాలండే బాహుబ‌లికి ముందు బాహుబ‌లి త‌రువాత అని చెప్ప‌క త‌ప్ప‌దు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 10:00 PM IST
త‌మ్ముడుతో ఇండ‌స్ట్రీలో అంద‌రి లెక్క‌లు మార‌తాయా?
X

తెలుగు సినిమా గురించి మాట్లాలండే బాహుబ‌లికి ముందు బాహుబ‌లి త‌రువాత అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే బాహుబ‌లి త‌రువాత తెలుగు సినిమా మార్కెట్ రికార్డు స్థాయిలో పెరిగింది. నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్‌తో పాటు శాటిలైట్‌, హిందీ డ‌బ్బింగ్, మ్యూజిక్ రైట్స్‌.. ప‌రంగా తెలుగు సినిమాకు ఆధాయం భారీగా పెరిగింది. ఎలాంటి హీరో సినిమా అయినా స‌రే హిందీ డ‌బ్బింగ్ ప‌రంగా మంచి బిజినెస్ జ‌రుగుతోంది. దీంతో హీరోలు, ఆర్టిస్ట్‌లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు త‌మ రెమ్యున‌రేష‌న్‌ల‌ని భారీగా పెంచేశారు.

అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారుతోంది. నాన్ థియేట్రిక‌ల్ ప‌రంగా ఓటీటీ బిజినెస్ తెలుగు సినిమాకు ప్ర‌ధాన వ‌న‌రుగా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు భారీగా త‌గ్గి సినిమాపై ప్ర‌భావాన్ని చూపిస్తోంది. అంతే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు తెలుగు సినిమా రిలీజ్ డేట్‌ల‌ని శాసించే స్థాయికి ప‌డిపోయింది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల దిల్ రాజ్ నిర్మొహ‌మాటంగా బ‌య‌ట‌పెట్టేశారు. అదే విధంగా `త‌మ్ముడు` సినిమా కోసం నితిన్ పారితోషికాన్ని కూడా త‌గ్గించాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు.

తాజా ప‌రిస్థితి నితిన్‌తో పాటు రానున్న రోజుల్లో అంద‌రికీ వర్తించే అవ‌కాశం ఉంద‌ని తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌తి సినిమాకు నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ప్ర‌ధానంగా మారింది. ఇక్క‌డ ఎంత డిమాండ్ ప‌లికితే అంత హీరోల‌కు పారితోషికాల‌ని నిర్మాత‌లు డిసైడ్ చేస్తున్నారు. థియేట‌ర్ల‌లో ఓపెనింగ్స్ వ‌చ్చినా రాక‌పోయినా కానీ ఓటీటీల్లో స‌ద‌రు హీరోకున్న క్రేజ్‌ని, జ‌రిగే బిజినెస్‌ని బ‌ట్టే పారితోషికాలు నిర్ణ‌యిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోల‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌, తేగే టికెట్‌ల‌ని బ‌ట్టి, జ‌రిగే థియేట్రిక‌ల్ బిజినెస్‌ని బ‌ట్టి నిర్ణ‌యించే వారు.

కానీ ఇప్పుడు ట్రెండు మారింది. హీరోకు ఓటీటీల్లో ఎంత బిజినెస్ ఉంది. ఏ స్థాయిలో అత‌నికి వీవ‌ర్ షిప్ అభిస్తోంది?.. వ్యూ ప‌వ‌ర్ అవ‌ర్ ని బ‌ట్టి, అత‌ని మార్కెట్ స్థాయిని నిర్ణ‌యించి పారితోషికాలు డిసైడ్ చేస్తున్నారు. హీరోలు కూడా థియేట్రిక‌ల్ బిజినెస్‌తో పాటు నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా త‌న సినిమా ఎంత డిమాండ్ చేస్తోంది. ఏ స్థాయిలో వ్యూస్‌ని రాబ‌డుతోంది. వంటి విష‌యాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నాకే హీరోలు త‌మ పారితోషికాల‌ని ఆ స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా అడుగుతున్నారు.

దీన్ని బేస్ చేసుకునే 'త‌మ్ముడు' సినిమాకు సంబంధించిన నితిన్ పారితోషికాన్ని దిల్ రాజు ప్లాన్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మారిన స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో నితిన్ రెమ్యున‌రేష‌న్ ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోల‌కు ఓ వేక‌ప్ కాల్ అని అంతా అంటున్నారు. మ‌రి ఈ మార్పుకు హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు అంగీక‌రిస్తారా?.. కొత్త ఫార్ములాకు జై కొడ‌తారా అన్న‌ది వేచి చూడాల్సిందే.