డ్యూ డేట్.. టాలీవుడ్ లో మరో కోర్టు రూమ్ డ్రామా
తెలుగు సినీ రంగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏలూరు శ్రీను ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు.
By: M Prashanth | 8 July 2026 4:09 PM ISTటాలీవుడ్‌లో సరికొత్త కథలతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సౌండ్ చేస్తున్నాయి. వైవిధ్యమైన కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు వెంటనే ఎట్రాక్ట్ అవుతుంటారు. కోర్టు రూమ్ డ్రామా అంటే కూడా జనాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గతంలో అల్లరి నరేష్ నాంది సినిమా, అలాగే నాని నిర్మించిన కోర్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకున్నాయి. ఇక ఇదే తరహాలో ఇప్పుడు ఒక సరికొత్త కోర్టు రూమ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అదే 'డ్యూ డేట్'. వర్షిష్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ఓపెనింగ్ సెరిమనీ హైదరాబాద్‌లో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది.
తెలుగు సినీ రంగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏలూరు శ్రీను ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. పవన్ తరిగోపులతో కలిసి ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఆనంద్ కె ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం జరిగిన ఈ పూజా కార్యక్రమాలతో మూవీ అధికారికంగా ప్రారంభమైంది.
సినిమా ముహూర్తపు షాట్‌కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌బోర్డ్ కొట్టగా, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇటీవలే వరుస హిట్లతో జోరు మీదున్న యంగ్ నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి కలిసి స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కు అందజేశారు. ఈ వేడుకలో దర్శకులు విజయ్ కనకమేదల, వీఐ ఆనంద్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ మేకర్స్ పాల్గొని చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఒక బర్నింగ్ ఇష్యూ ఆధారంగా ఈ కోర్టు రూమ్ డ్రామాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. సినిమా టైటిల్ దగ్గర నుంచే ఒక వైవిధ్యం చూపించామని, ప్రతి సీన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టేలా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందన్నారు. అన్ని వర్గాల ఆడియన్స్‌కు నచ్చే సరికొత్త కమర్షియల్ ఎలిమెంట్స్, కథనం ఇందులో ఉంటాయని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో లోమేష్ పుడిపెద్ది, జెశ్రీ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా, ప్రణీత్ పట్నాయక్, విజ్ఞాని, చందు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. చెంచు జింక సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మాదురి మధు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. ధీరజ్, ప్రసాద్ లింగం సాంకేతిక విభాగంలో ముఖ్య బాధ్యతలు చూస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికతోనే సినిమాపై ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిగా ముగించుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఒక బలమైన పాయింట్‌తో వస్తున్న ఈ కొత్త ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
