కుమార్తెలిద్దరికీ ఆయన సెటిల్ చేసేసారా?
తాజాగా మరో సెలబ్రిటీ కుటుంబం కూడా ఆస్తుల పంపకాలు పూర్తి చేసినట్లు తెలిసింది.
By: Tupaki Desk | 18 May 2025 1:00 AM ISTఆస్తుల పంపకాల విషయంలో వివాదాలు వస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. డబ్బు దగ్గర తన , మన అనే బేధాలంటూ ఏవీ ఉండవు. ఈ విషయంలో డబ్బులేని వాడు ఎలాంటి సమస్యలు లేకుండా రిలాక్స్ గా ఉంటన్నారు. డబ్బు ఉంటేనే ఇలాంటి సమస్యలన్ని తలెత్తుతంటాయి. పంపకాలు సవ్యంగా లేకపోతే రకరకాల వివాదాలు తెరపైకి వస్తుంటాయి. ఇటీవలే ఓ టాలీవుడ్ ఫ్యామిలీ ఈ విషయంలో ఎంతటి వివాదాలు తలెత్తాయో తెలిసిందే.
తాజాగా మరో సెలబ్రిటీ కుటుంబం కూడా ఆస్తుల పంపకాలు పూర్తి చేసినట్లు తెలిసింది. ఆ కుటుంబంలో తండ్రికి ముగ్గురు పిల్లలు కాగా, అందులో ఇద్దరు ఆడ పిల్లలు..ఓ కుమారుడు ఉండటంతో ఆస్తుల పంపకం సమానంగా వేసినట్లు సమాచారం. కుమార్తెలిద్దరికి స్థిర, చర ఆస్తులు పంచేసినట్లు సమాచారం. వాటిలో కొన్ని వ్యాపారాలు కూడా ఉండటంతో వాటి తాలుకా డాక్యుమెంట్లు అన్నింటిచిన చట్ట పరంగా భవిష్యత్ లో ఎలాంటి వివాదాలు లేకుండా లాయర్లు..జడ్జ్ ల సమక్షంలోనే సెటిల్ చేసారుట.
ఈ సెటిల్ మెంట్ అయిన తర్వాతే అతడి కుమార్తె నిర్మాణ సంస్థను స్థాపించినట్లు చెబుతున్నారు. అలాగే చిన్న కుమార్తెకు ముంబైలో ఉన్న కొన్ని వ్యాపారాలను అప్పగించారుట.వాటిని స్వయంగా వెళ్లి చూపించి వచ్చారుట. కంపెనీ లావాదేవీల వ్యవహారాలన్నింటిని అప్పగించారుట. పెద్ద కుమార్తెతో సమానంగా ఈ పంపకాలు జరిగినట్లు సమాచారం. కుమారుడికి ఇప్పటి వరకూ ఇవ్వాల్సినవాటిని కూడా సెటిల్ చేసినట్లు సమాచారం.
తాను కూడా పెద్ద స్టార్ కావడంతో ? కుమార్తెలతో పొలిస్తే కుమారుడికి 20 శాతం వాటా తగ్గించి ఇచ్చా రుట. తదానంతనం తండ్రి ఆస్తి కూడా కుమారుడికి వస్తుంది కాబట్టి ఇక్కడ కొత పడినట్లు తెలుస్తోంది. అంతా ఓ చోట కుర్చుని కుటుంబ సభ్యలు ఎలాంటి వివాదాలు లేకుండా లాయర్లు సమక్షంలోనే ఈ పంపకాలు జరిగినట్లు చెబుతున్నారు.