Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : తెలుగమ్మాయి ఐకానిక్‌ ఫోజ్

అలాంటి సమయంలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్‌గా మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటి వరకు పలువురు యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది

By:  Tupaki Desk   |   7 Feb 2025 7:00 AM IST
పిక్‌టాక్ : తెలుగమ్మాయి ఐకానిక్‌ ఫోజ్
X

తెలుగు అమ్మాయిలకు హీరోయిన్స్‌గా అవకాశాలు రావు, తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేయడం వృధా అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్‌గా మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటి వరకు పలువురు యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. అతి కొద్ది మంది తెలుగు అమ్మాయిలు మాత్రమే హీరోయిన్స్‌గా రాణిస్తున్న ఈ సమయంలో ముద్దుగుమ్మ ఈషా రెబ్బకి మంచి అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

2012లో లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర అయినా ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా కష్టపడింది. పేరు విభిన్నంగా ఉండి, తెలుగు అమ్మాయి కాకపోయి ఉండవచ్చు అని చాలా మంది అనుకున్నారు. ఇండస్ట్రీలో ఈషా రెబ్బా అంటే ఉత్తరాది అమ్మాయి అనే అభిప్రాయం ఉంది. అలా కొన్ని ఆఫర్లు ఈ అమ్మడు దక్కించుకుని ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి టాలీవుడ్‌లో మంచి ఆఫర్లను సొంతం చేసుకున్న ఈషా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

బాలీవుడ్‌ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌తో సమానంగా అందంగా కనిపించే ఈషా రెబ్బ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోలు ఎప్పుడూ వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె షేర్‌ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వైట్‌ టీషర్ట్‌ బ్లూ జీన్స్‌తో ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఐకానిక్ ఫోజ్ తో అందరి దృష్టి ఆకట్టుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్, ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నెటిజన్స్‌ ఈ ఫోటోలను తెగ లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి ముద్దుగుమ్మ నార్త్‌ అమ్మాయి అయ్యి ఉంటే కచ్చితంగా టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్‌తో నటించే అవకాశాలు వచ్చేవి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ కనిపించిన ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలు, సిరీస్‌ల్లో నటించాలని భావిస్తుంది. గత ఏడాది పెద్దగా గుర్తింపు తెచ్చే పాత్రలు ఏమీ దక్కించుకోలేక పోయింది. కనీసం ఈ ఏడాదిలో అయినా మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో వెయిట్‌ చేస్తుంది. అందమైన ఈషా రెబ్బకి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశం రాకపోవడం దారుణం అంటూ కొందరు ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.