వార్ ఎఫెక్ట్.. టాలీవుడ్ సెలబ్రిటీల ఆస్తుల సంగతేంటి?
టాలీవుడ్ కు చెందిన కొంతమంది అగ్ర హీరోలు, యంగ్ హీరోలు ఎప్పటికప్పుడు విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంటారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంటుంది.
By: M Prashanth | 11 March 2026 10:00 PM ISTటాలీవుడ్ కు చెందిన కొంతమంది అగ్ర హీరోలు, యంగ్ హీరోలు ఎప్పటికప్పుడు విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంటారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంటుంది. ముఖ్యంగా దుబాయ్ లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఆసక్తి చూపుతూ అక్కడ విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసినట్లు వినికిడి. అయితే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధం పరిస్థితుల కారణంగా ఇన్వెస్ట్మెంట్లపై ఆందోళన వ్యక్తమవుతోందని చర్చ సాగుతోంది.
నిజానికి.. గత ఐదేళ్లలో కొందరు టాలీవుడ్ హీరోలు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో కలిసి దుబాయ్ లోని ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పామ్ జమైరా హ్ (Palm Jumeirah), దుబాయ్ మెరీనా (Dubai Marina) వంటి అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో విల్లాలు, అపార్ట్మెంట్లు తీసుకున్నట్లు సమాచారం. అప్పుడు ఆ పెట్టుబడులు మంచి ప్రాఫిటబుల్ అసెట్స్ గా మారుతాయని భావించారట.
సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి విల్లాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తుండగా.. మూడేళ్ల నుంచి నాలుగేళ్లలో ధరలు రెట్టింపు అవుతాయని అంచనా వేశారని వినికిడి. కొందరైతే ఆ ప్రాపర్టీలు రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని భావించి కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు ఆ అంచనాలు తారుమారు చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ ఎఫెక్ట్.. రియల్ ఎస్టేట్ మార్కెట్ పై పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉండే యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో మార్కెట్ కీలకంగా ఉంటుంది. భద్రతా పరిస్థితులపై సందేహాలు తలెత్తితే రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలో కొంత తగ్గుదల రావచ్చని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అభిప్రాయపడుతున్నారు.
దీంతో కొంతకాలం పాటు ఆస్తుల ధరలు తగ్గే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టిన సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆస్తుల విలువ తగ్గితే పెట్టుబడులు నిలిచిపోతాయేమో అనే సందేహం వ్యక్తమవుతోంది. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఆ పెట్టుబడులు తిరిగి పొందడం కష్టమవుతుందేమో అన్న భయం ఏర్పడిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ మాత్రం దీన్ని టెంపరరీ పొజిషన్ గా చూస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ బిజినెస్ పాయింట్ కావడంతో అక్కడి మార్కెట్ మళ్లీ స్ట్రాంగ్ గా మారుతుందని చెబుతున్నారు. గతంలో కొన్ని పరిస్థితుల్లో అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి కోలుకున్న విషయాలను గుర్తు చేస్తున్నారు. అదే జరిగితే అక్కడ పెట్టుబడులు పెట్టిన టాలీవుడ్ సెలబ్రిటీలకు మళ్లీ లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.
