Begin typing your search above and press return to search.

ఆ బుల్లితెర ఆర్టిస్ట్ కి పెద్ద బాధ్య‌తే ఇస్తున్నారే!

ఇప్పుడామెకి పెద్ద బాధ్య‌త‌లే అప్ప‌గిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. రోహిణి ప్ర‌తిభ‌ని మెచ్చి సీనియ‌ర్ న‌టి శ్రీల‌క్షికి ప‌ర్పెక్ట్ రీప్లేస్ మెంట్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2024 2:30 AM GMT
ఆ బుల్లితెర ఆర్టిస్ట్ కి పెద్ద బాధ్య‌తే ఇస్తున్నారే!
X

బుల్లి తెర న‌టి..జ‌బ‌ర్ద‌స్త్ షోతో ఫేమ‌స్ అయిన రోహిణి సుప‌రిచిత‌మే. ఈ మ‌ధ్య సినిమాల్లోనూ అవ‌కాశాలు అందుకుంటుంది. సీరియ‌ల్స్ చేసినంత కాలం తానెవ్వ‌రో తెలియ‌లేదు కానీ..జ‌బ‌ర్ద‌స్త్ షోతో ట్యాలెంట్ బ‌య‌ట పెట్టింది. అప్ప‌టి నుంచి బాగా పేరు వ‌చ్చింది. ఇప్పుడా ఐడెంటీటీతోనే సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. క‌నిపించేది కాసేపే అయినా త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో అల‌రిస్తుంది.

ఇప్పుడామెకి పెద్ద బాధ్య‌త‌లే అప్ప‌గిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. రోహిణి ప్ర‌తిభ‌ని మెచ్చి సీనియ‌ర్ న‌టి శ్రీల‌క్షికి ప‌ర్పెక్ట్ రీప్లేస్ మెంట్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. శ్రీల‌క్ష్మి ఎంత గొప్ప న‌టి అన్న‌ది చెప్పాల్సిన ప‌ని లేదు. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. పాత త‌రం న‌టుల్లో ఆమెకంటూ ప్ర‌త్యేక‌మైన ఐడెంటిటీ ఉంది. అయితే ఇప్పుడు అవ‌కాశాలు రాక సినిమాలు చేయ‌డం లేదు.

కానీ ఛాన్సులు ఆమెకి రాక‌పోయినా రోహిణికి రావ‌డంతో ఆమె శ్రీల‌క్ష్మిని మ‌రిపిస్తుందంటున్నారు. ఆహర్యంలో శ్రీల‌క్ష్మిని పోల‌వ‌డంతో పాటు..న‌ట‌న ప‌రంగా అంత‌టి గ్రేస్ కూడా ఆమెకుంద‌నిపిస్తుంది.

చాలా కాలంగా శ్రీలక్ష్మి తరహా పాత్రలు చేసేవారు లేరనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అలాంటి వారంతా రోహీణి కోసం పాత్ర‌లు డిజైన్ చేస్తే స‌రి..శ్రీల‌క్ష్మిని త‌ల‌పిస్తుంద‌ని చెబుతున్నారు. ఇటీవల వచ్చిన 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్ లో వంటమనిషి లక్ష్మి పాత్రలో రోహిణి మెప్పించింది.

ఆ సిరీస్ మొత్తంలోకి ఆమె పాత్ర హైలైట్ గా నిలిచింది. సినిమాల్లోను ఈ తరహా పాత్రలను రోహిణి కోసం రాయోచ్చు. కోవై స‌ర‌ళ‌...విద్యుల్లేక రామ‌న్ లాంటి వారికి కూడా రోహిణిని ఆప్ష‌న్ గా చూపించొచ్చు. కొత్త త‌ర‌హా హ‌స్యాన్ని వెండి తెర‌పై రోహిణితో పండిచొచ్చు అని కొంద‌రంటున్నారు. మ‌రి రోహిణి ని దృష్టిలో పెట్టుకుని ఎవ‌రైనా పాత్ర‌లు రాస్తారా? అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తారా? అన్న‌ది చూడాలి.