Begin typing your search above and press return to search.

'కింగ్‌డమ్'కు ఏపీ ఓకే.. మరి తెలంగాణ?

భారీ అంచనాల మధ్య ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజైంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది.

By:  Tupaki Desk   |   24 July 2025 4:39 PM IST
కింగ్‌డమ్కు ఏపీ ఓకే.. మరి తెలంగాణ?
X

భారీ అంచనాల మధ్య ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజైంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ‘వీరమల్లు’కు రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించాయి ప్రభుత్వాలు. ఏపీలో ఏ సినిమాకు అదనపు రేట్లు, షోలు అడిగినా ఈజీగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో ‘పుష్ప-2’ విషాదం తర్వాత బ్రేకులు పడ్డాయి. మళ్లీ ఎక్స్‌ట్రా రేట్లతో ప్రిమియర్లు వేసుకునే, రెగ్యులర్ షోలకు భారీ రేట్లు పెట్టుకునే సౌలభ్యం దక్కింది ‘వీరమల్లు’కే.

ఐతే ఈ సినిమాకు పర్మిషన్లు ఇవ్వడంలో చిన్న మెలిక ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో తమ సినిమా ఆ కేటగిరీకే వస్తుందని చెప్పి రత్నం జీవో తెచ్చుకున్నారు. మరి మిగతా సినిమాల సంగతేంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం.

వచ్చే వారం విడుదల కానున్న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాకు వారం ముందే ఏపీలో జీవో వచ్చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.75 మేర రేటు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటన్నదే చూడాలి.

‘కింగ్‌డమ్’ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నుంచి వచ్చిన చివరి పెద్ద సినిమా ‘డాకు మహారాజ్’కు అదనపు రేట్ల కోసం అసలు అప్లికేషనే పెట్టలేదు. ఐతే అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. ‘హరిహర వీరమల్లు’కు అనుమతులు వచ్చిన నేపథ్యంలో తమకూ అవకాశం ఇవ్వాలని అడుతారేమో చూడాలి. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకే అంటే మాత్రం సైలెంటుగా ఉండడమే బెటర్. ఏపీతో పోలిస్తే తెలంగాణలో టికెట్ల ధరలు కొంచెం ఎక్కువే కాబట్టి మళ్లీ అదనపు రేట్లు ఎందుకని సైలెంట్ అయినా అయిపోవచ్చు.