Begin typing your search above and press return to search.

కూలీ - వార్ 2: టికెట్ హైక్స్ లో మరో ట్విస్ట్?

ఆగస్ట్ 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి.

By:  M Prashanth   |   12 Aug 2025 4:57 PM IST
కూలీ - వార్ 2: టికెట్ హైక్స్ లో మరో ట్విస్ట్?
X

ఆగస్ట్ 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. రజనీకాంత్ నటించిన కూలీ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన వార్ 2. ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో టికెట్ ధరల పెంపు అంశం కూడా గత 24 గంటల్లో హై వోల్టేజ్ డిస్కషన్‌కి దారితీసింది.

కానీ, తాజా అప్‌డేట్ ప్రకారం ఈ ఇష్యూ ఫ్యాన్స్‌కు ఊరట కలిగించేలా మారిందని మరో టాక్ వినిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో కూలీ, వార్ 2 సినిమాలకు తెలంగాణలో భారీ టికెట్ హైక్స్ వస్తున్నాయనే వార్తలు వైరల్ అయ్యాయి. మల్టీప్లెక్సుల్లో రూ.400 పైగా, సింగిల్ స్క్రీన్లలో రూ.200 పైగా రేట్లు ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఈ లీక్ న్యూస్ కారణంగా కొంతమంది నెటిజన్లు, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఓరిజినల్ తెలుగు సినిమాలకే ఇంత రేట్లు పెంచినా పర్లేదు కానీ డబ్బింగ్ సినిమాలకు పెంచడం ఏంటీ?” అని ప్రశ్నించారు. ఈ రియాక్షన్స్ వల్ల పరిస్థితి మరింత హీటెక్కింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం తెలంగాణలో ఎలాంటి పెంపు ఉండదని, ప్రస్తుత గరిష్ట ధరలే అమల్లో ఉంటాయని తెలుస్తోంది. అంటే మల్టీప్లెక్సుల్లో గరిష్టంగా 295, సింగిల్ స్క్రీన్లలో 175 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అక్కడ ఉన్న ప్రస్తుత రేట్లు నైజాం కన్నా తక్కువగా ఉన్న కారణంగా 50 నుంచి 75 రూపాయల వరకు పెంపు వచ్చే అవకాశం ఉందని టాక్ ఉంది. ఇదే సమయంలో కూలీ vs వార్ 2 పోరు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారనుంది. రెండు సినిమాలకీ స్టార్ పవర్, భారీ బడ్జెట్, టాప్ టెక్నికల్ టీమ్స్ ఉన్నప్పటికీ, ప్రీ రిలీజ్ బజ్‌లో కొంత తేడా కనిపిస్తోంది.

కూలీలో రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ వంటి భారీ కాస్టింగ్ ఉండగా, వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వాణీ లాంటి తారాగణం వైరల్ అవుతోంది. ముఖ్యంగా USA ప్రీమియర్స్ ప్రీ సేల్స్‌లో కూలీ ($533K*) వార్ 2 ($332K*) కంటే ముందంజలో ఉంది.

టికెట్ రేట్ల హైక్స్ లేకపోవడం రెండు సినిమాలకీ లాభమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పండగ సీజన్, లాంగ్ వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వచ్చే అవకాశం పెరుగుతుంది. అధిక ధరల కారణంగా వెనకడుగు వేసే ప్రేక్షకులు ఇప్పుడు సులభంగా థియేటర్లకు రావచ్చు. అదే సమయంలో, తక్కువ రేట్లు ఓపెనింగ్స్‌కి కూడా బూస్ట్ ఇస్తాయని అంచనా.