Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీపై ఆ బాధ్య‌త ఉంది

జూన్ 14న జ‌ర‌గ‌బోయే ఈ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాల్సిన బాధ్య‌త సినీ ఇండ‌స్ట్రీపై ఉంద‌ని ప్ర‌ముఖ నిర్మాత‌, ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్ రాజు అన్నారు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 1:05 PM IST
ఇండ‌స్ట్రీపై ఆ బాధ్య‌త ఉంది
X

తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త కొన్నేళ్లుగా సినిమాల‌కు సంబంధించిన అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌డం మానేసింది. గ‌త 14 సంవ‌త్స‌రాలుగా తెలంగాణ ప్ర‌భుత్వం అవార్డుల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది లేదు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ పున‌రుద్ధరించి తెలంగాణ గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డుల‌ను రీసెంట్ గానే అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

2024 లో రిలీజైన సినిమాల‌తో పాటూ 2014 నుంచి 2024 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాల్లో బెస్ట్ సినిమాల‌ను సెలెక్ట్ చేసి అందులో భాగంగా వివిధ విభాగాల్లో విజేత‌ల‌ను కూడా ప్ర‌క‌టించారు. జూన్ 14న హైద‌రాబాద్ లోని హైటెక్స్ వేదిక‌గా ఈ అవార్డుల వేడుకను ఘ‌నంగా నిర్వ‌హించడానికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది.

ప్ర‌తిభను గుర్తించి అవార్డుల‌తో స‌త్క‌రించ‌బోతున్న తెలంగాణ ప్ర‌భుత్వం మీద టాలీవుడ్ తార‌ల‌తో పాటూ తెలుగు సినిమా ప్రేక్ష‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ అవార్డుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం స్పెష‌ల్ గా ఓ జ్యూరీని కూడా ఏర్పాటు చేసింది. జూన్ 14న జ‌ర‌గ‌బోయే ఈ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాల్సిన బాధ్య‌త సినీ ఇండ‌స్ట్రీపై ఉంద‌ని ప్ర‌ముఖ నిర్మాత‌, ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్ రాజు అన్నారు.

జూన్ 14న జ‌రిగే ఈ కార్య‌క్ర‌మం ఐ అండ్ పీఆర్ ద్వారా లైవ్ లో ప్ర‌సారం కానుంద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ ఈ ఈవెంట్ రీచ్ అవాల‌నే ఆలోచ‌నతో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ వేడుక‌ను నిర్వ‌హిస్తుంద‌ని, 14 ఏళ్ల త‌ర్వాత ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ అవార్డుల వేడుక‌ను నిర్వ‌హించ‌నుంద‌ని, టాలెంట్ ను ఎంక‌రేజ్ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న ఈ వేడుకకు అంద‌రూ హాజ‌ర‌వాల‌ని ఆయ‌న కోరారు. 14 ఏళ్ల త‌ర్వాత తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న సినీ వేడుక కావ‌డంతో తెలుగు తార‌లంతా ఈ ఈవెంట్ కు హాజ‌ర‌వ‌డం ఖాయం.