TGFA అవార్డ్స్ వేడుకలో ఆ ముగ్గురు హీరోలు..!
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ వేడుకల్లో నందమూరి నట సింహం బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు.
By: Tupaki Desk | 14 Jun 2025 11:50 PM ISTతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ వేడుక హైదరాబాద్ హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి స్టార్ సెలబ్రిటీస్ తో పాటుగా ఎంతోమంది నటులు, సాంకేతిక నిపుణులు అటెండ్ అయ్యారు. 2014 నుంచి 2023 వరకు రిలీజైన సినిమాల్లో బెస్ట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కేటగిరిల్లో టి.జి.ఎఫ్.ఏ అవార్డులు అందిస్తున్నారు.
ఐతే తెలంగాణ ప్రభుత్వం తరపున జరుగుతున్న తొలి సినిమా పండుగ కాబట్టి ఈ వేడుకను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. హైటెక్స్ లో ఏర్పరచిన వేడిక అద్భుతంగా ఉంది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ వేడుకల్లో నందమూరి నట సింహం బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఈ ముగ్గురికి అవార్డులు వచ్చాయి.
TGFA అవార్డ్ వేడుకలో కేవలం అవార్డ్ వచ్చిన హీరోలు మాత్రమే ఈ వేడుకకు అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు ఇతర భాషల టెక్నిషియన్స్ కూడా అంటెడ్ అయ్యారు. గత 12 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సినిమాలను కేటగిరిలుగా జ్యూరీ సెలెక్ట్ చేసి నేడు టి.జి.ఎఫ్.ఏ అవార్డులను అందించనున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సినిమా వేడుకగా ఇది చెప్పొచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడడమే కాకుండా అవార్డులతో కళాకారులకు ప్రోత్సాహకాలు అందించడం వారి ప్రతిభను గుర్తించడం లాంటిదే. టి.జి.ఎఫ్.ఏ అవార్డ్ వేడుకల్లోఎంతోమంది సినీ తారలు. అవార్డు పొందిన వారు సినీ జర్నలిస్టులు ఇంకా అతిరథమహారధులు అంతా అటెండ్ అయ్యి వేడుకని గ్రాండ్ సక్సెస్ చేశారు.
