TGFA అవార్డ్స్ వేడుకలో థమన్ హంగామా..!
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ మ్యూజిక్ శ్రోతలను అలరించింది.
By: Tupaki Desk | 14 Jun 2025 11:47 PM ISTతెలంగాణ ప్రభుత్వం సినీ కళాకారులకు అందిస్తున్న తెలంగాణా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ అవార్డ్ వేడుకకు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన అతిరథమహారధులు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్ జయప్రద, జయసుధ, సుహాసిని ఈ అవార్డుల్లో పాల్గొన్నారు.
ముందుగా అవార్డులు గెలుచుకున్న సినీ టెక్నీషియన్స్ కు జర్నలిస్టులకు మిగతా వారికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవార్డులను అందించారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2014 నుంచి 2023 వరకు రిలీజైన అన్ని సినిమాల్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్ లకు అవార్డులను అందిస్తున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ మ్యూజిక్ శ్రోతలను అలరించింది. థమన్ తన సినిమాల్లోని సాంగ్స్ తో మెడ్లీ పర్ఫార్మెన్స్ చేయగా వేడుకకు అవి ఎంతో జోష్ తెచ్చాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు ఈ అవార్డ్ వేడుక అంతా అనుకున్న విధంగా జరిగేలా ఎఫ్.డీ.సీ చైర్మన్ దిల్ రాజు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు తెలుగు సినీ పరిశ్రమ కదిలి వచ్చింది. తెలుగు సినీ కళాకారులకు దాదాపు 12 ఏళ్లుగా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సినీ వేడుక అవార్డ్ ఫంక్షన్ జరగలేదు. ఐతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ కళాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఏర్పడిన ఏడాది నుంచి గత సంవత్సరం వరకు ప్రేక్షకులను అలరించిన సినిమాల్లో బెస్ట్ మూవీ, డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఇలా పలు కేటరిగిల్లో ఎంపిక చేసి విజేతలకు టి.జి.ఎఫ్.అవార్డులతో పాటు 5 లక్షల నగదు కూడా అందిస్తున్నారు.
