Begin typing your search above and press return to search.

తెలంగాణ గద్దర్ అవార్డుల వేదిక ఫిక్స్..!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకు హైటెక్స్ ని వేదికగా ఎంపిక చేశారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 11:07 PM IST
తెలంగాణ గద్దర్ అవార్డుల వేదిక ఫిక్స్..!
X

ఇటీవల ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను జూన్ 14న నిర్వహించనున్నారు. కొంత గ్యాప్ తర్వాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేలా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టింది. 2014 జూన్ నుంచి 2024 డిసెంబర్ 31 వరకు సెన్సార్ జరుపుకున్న సినిమాల్లో బెస్ట్ సినిమాలు ఎంపిక చేసి అవార్డులను ఇవ్వనున్నారు.

ఇప్పటికే అవార్డ్ విన్నర్స్ లిస్ట్ అనౌన్స్ చేశారు. ఐతే ఈ అవార్డ్ వేడుకను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకు హైటెక్స్ ని వేదికగా ఎంపిక చేశారు. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికను ఈ వేడుక కోసం సిద్ధం చేస్తున్నారు. సినిమా వాళ్లకు ప్రభుత్వం తరపున అవార్డులు ఇచ్చి చాలా ఏళ్లు అవుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుల వేడుకను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్.డీ.సీ చైర్మన్ దిల్ రాజు పర్యవేక్షిస్తున్నారు. జూన్ 14న హైటెక్స్ లో జరగనున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు టాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా కదిలి రానుందని తెలుస్తుంది. ప్రభుత్వం తరపున జరుగుతున్న వేడుక కాబట్టి స్టార్స్ అంతా వేడుకలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జూన్ 14న జరగనున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా 2014 నుంచి 2024 వరకు పదేళ్లుగా ప్రేక్షకులను అలరించిన సినిమాల్లో సెలెక్ట్ చేసిన కేటగిరిల్లో అవార్డుల పొందిన వారికి పతకాలు అందించనున్నారు. ప్రభుత్వం తరపున చాలా కాలం తర్వాత జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్ కాబట్టి టాలీవుడ్ నుంచి కూడా కేవలం అవార్డ్ అందుకున్న వారు మాత్రమే కాకుండా అందరు పాల్గొనేలా ఏర్పాట్లు చూస్తున్నారు.

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో పదేళ్ల సినీ పండగ జరగబోతుంది. తాము పడిన కష్టానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఈ ప్రోత్సాహకాలు కళాకారులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఈ అవార్డుల వేడుక ఎంతో ప్రత్యేకం కానుంది.