Begin typing your search above and press return to search.

ఆ మెగా ఛాన్స్ కోసం వెయిటింగ్ అంటున్న తేజ్..!

మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు అన్న ప్రశ్న అడిగారు. దానికి తేజ్ కూడా ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ సమాధానం ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 7:07 AM GMT
ఆ మెగా ఛాన్స్ కోసం వెయిటింగ్ అంటున్న తేజ్..!
X

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ ఇయర్ విరూపాక్ష, బ్రో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్సిడెంట్ తో ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన సాయి తేజ్ చిన్నగా కోలుకుని మళ్లీ తిరిగి సినిమాలు చేస్తూ వారిని అలరిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగా మెగా ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడిని అలరించే సినిమాలు చేస్తూ వస్తున్నాడు సాయి ధరం తేజ్. 2014 నవంబర్ 14న సాయి తేజ్ మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా రిలీజైంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనేలా మొదటి సినిమాలోని తన జోష్ తో మెగా ఫ్యాన్స్ కి దగ్గరయ్యాడు ఈ మెగా మేనల్లుడు.

టాలీవుడ్ లో 9 ఏళ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న సాయి తేజ్ ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేశాడు. ట్విట్టర్ స్పేస్ లో ఆస్క్ సాయి ధరం తేజ్ స్పెషల్ ప్రోగ్రాం రన్ చేయగా అందులో మెగా మేనల్లుడిని మెగా ఫ్యాన్స్ ఆసక్తికరమైన ప్రశ్నలు వాటికి సమాధానాలు రాబట్టారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేశావ్.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు అన్న ప్రశ్న అడిగారు. దానికి తేజ్ కూడా ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ సమాధానం ఇచ్చాడు.

చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ కాంబో సినిమా వస్తే మామా అల్లుళ్ల హంగామా మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. బ్రో డాడీ రీమేక్ లో వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తెలిసింది. తేజ్ మాత్రం మెగాస్టార్ సినిమా ఛాన్స్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఇక తన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని ప్రయత్నిస్తానని అన్నారు.

తన నెక్స్ట్ సినిమా సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ వస్తుందని తప్పకుండా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని అన్నారు. తనని ఇలానే ఆదరిస్తూ ఉండాలని మిమ్మల్ని అలరించేలా సినిమాలు చేస్తానని అన్నారు సాయి తేజ్. అసలైతే తేజ్ కెరీర్ ఇంకా జోష్ ఫుల్ గా ఉండేది కానీ యాక్సిడెంట్ వల్ల రెండేళ్లు ఇంటికే పరిమితం కాగా తేజ్ ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడని తెలుస్తుంది. గాంజా శంకర్ తో మాస్ అప్పీల్ చేస్తున్న సాయి తేజ్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.