Begin typing your search above and press return to search.

మా పెళ్లి అంత ఈజీగా అవ‌లేదు!

రాజు గారితో త‌న పెళ్లి అంత ఈజీగా జ‌ర‌గ‌లేద‌ని, దాని కోసం చాలానే క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని ఆమె తెలిపారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 11:00 PM IST
మా పెళ్లి అంత ఈజీగా అవ‌లేదు!
X

ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు త‌న మొద‌టి భార్య అనిత చ‌నిపోయాక రెండో పెళ్లి చేసుకోగా అప్ప‌ట్లో ఆ పెళ్లిపై చాలానే డిస్కష‌న్స్ జ‌రిగాయి. క‌రోనా టైమ్ లో ఇరు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య చాలా సింపుల్ గా వీరి పెళ్లి జ‌రిగింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తేజ‌స్విని త‌మ ప్రేమ‌, పెళ్లి గురించి ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

రాజు గారితో త‌న పెళ్లి అంత ఈజీగా జ‌ర‌గ‌లేద‌ని, దాని కోసం చాలానే క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని ఆమె తెలిపారు. మొద‌ట్లో ఆయ‌నెవ‌రో కూడా తెలియ‌దని, ఆయ‌న గురించి తెలియ‌న‌ప్పుడు ఆయ‌నొక డైరెక్ట‌ర్ అనుకున్నాన‌ని, కానీ త‌ర్వాత గూగుల్ చేస్తే ప్రొడ్యూస‌ర్ అని తెలిసింద‌ని చెప్పుకొచ్చారు. ముందు ఆయ‌న‌కు ఫ్యామిలీ ఉంద‌ని తెలిసి వెనుక‌డుగేశాన‌ని, ఆ త‌ర్వాత కొంత కాలానికి విధి తామిద్ద‌రిన క‌లిపింద‌ని తేజశ్వినీ తెలిపారు.

దేవుడు తాను కోరుకున్న‌వ‌న్నీ ఇచ్చాడ‌ని, ఇంకా చెప్పాలంటే కోరుకున్న దాని కంటే ఇంకా ఎక్కువే ఇచ్చాడ‌ని ఈ విష‌యంలో తానెంతో అదృష్ట‌వంతురాలిన‌ని చెప్తోన్న తేజ‌స్విని, తాను దిల్ రాజు ను పెళ్లి చేసుకుంటాన‌నే విష‌యం ఇంట్లో చెప్ప‌డానికి ఎంతో ఆలోచించాన‌ని, ఆ టైమ్ లో ముందు ఎవ‌రిని క‌న్విన్స్ చేయాల‌ని దిల్ రాజు అడ‌గ్గా తాను త‌న పెద్ద మామ గురించి చెప్పాన‌ని చెప్పారు.

త‌మ ఫ్యామిలీలో త‌న పెద్ద మామ చాలా స్ట్రిక్ట్ అని, ముందు ఆయ‌న్ని ఒప్పిస్తే మిగిలిన వారిని ఈజీగా క‌న్విన్స్ చేయొచ్చ‌నుకున్నామ‌ని, ఆ త‌ర్వాత త‌న పిన్నికి చెప్పాల‌నుకున్నామ‌ని, తన‌ను త‌న పిన్నే పెంచిందని తేజ‌స్వినీ వెల్ల‌డించారు. విష‌యం తెలిశాక త‌న పిన్ని, బాబాయి అస‌లు న‌మ్మ‌లేద‌ని, పెళ్లికి వార‌స‌లు ఒప్పుకోలేద‌ని, కానీ అన్నీ అర్థం చేసుకుని ఆఖ‌రికి త‌న పెద్ద మామే అంద‌రినీ ఒప్పించార‌ని, త‌న పెద్ద మామ ఫ్యామిలీ మొత్తానికి హిట్ల‌ర్ లాంటి వార‌ని, ఆయ‌న వ‌ల్లే ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నాన‌ని తేజ‌శ్వినీ తెలిపారు. కాగా ఇప్పుడు దిల్ రాజు, తేజ‌స్వినికి ఓ బాబు కూడా ఉన్నాడు. తేజ‌స్వినీ త‌మ పెళ్లి విష‌యంలో ప‌డిన క‌ష్టాల గురించి మాట్లాడిన మాట‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.