Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : తెలుగమ్మాయి హాలీవుడ్‌ షో

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావు, అయినా కూడా ఇన్నాళ్లు ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది

By:  Tupaki Desk   |   14 May 2024 1:51 PM GMT
పిక్ టాక్ : తెలుగమ్మాయి హాలీవుడ్‌ షో
X

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెల్లెలు పాత్రలో నటించి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన తేజస్వి మదివాడ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావు, అయినా కూడా ఇన్నాళ్లు ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది.

డాన్స్ నేర్చుకుంటూ మాస్ కమ్యూనికేషన్స్‌ అండ్‌ జర్నలిజంలో డిగ్నీ చేస్తున్న సమయంలో తేజస్వి కి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా విడుదల తర్వాత హీరోయిన్‌ గా మరియు ఇతర పాత్రల్లో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

వర్మ సినిమా ఐస్ క్రీమ్‌ ద్వారా ఈమె పాపులారిటీ మరింత పెరిగింది. హీరోయిన్‌ గా తేజస్వి మదివాడ పలు సినిమాల్లో నటించినప్పటికి అవి పరిమిత బడ్జెట్‌ సినిమాలు అవ్వడంతో పాటు అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించడంలో విఫలం అయ్యాయి. దాంతో ఆఫర్ల కోసం ఈ అమ్మడు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించినా కూడా సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. అలరించే ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ ఫోటోలు మరోసారి నెట్టింట వైరల్‌ అయ్యాయి.

ఈసారి తేజస్వి ఆరంజ్ కలర్‌ ఔట్‌ ఫిట్‌ ఫిట్‌ లో క్లీ వేజ్ షో తో మతి పోగొట్టింది. ఈ స్థాయి స్కిన్‌ షో చేసినా కూడా తేజస్వికి దక్కాల్సిన ఆఫర్లు, రావాల్సిన గుర్తింపు రాలేదు అంటూ కొందరు నెటిజన్స్‌ ఈ అమ్మడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.