Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్లోజప్‌ లో అందాల తేజస్వి

మహేష్ బాబు, సమంత జంటగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ

By:  Tupaki Desk   |   11 Dec 2023 3:58 AM GMT
పిక్ టాక్ : క్లోజప్‌ లో అందాల తేజస్వి
X

మహేష్ బాబు, సమంత జంటగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ. ఈమె మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత చెల్లి పాత్రలో కనిపించిన తేజస్వి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే.


రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్‌క్రీం అనే సినిమాలో నటించడం ద్వారా సెన్షేషనల్ హీరోయిన్ గా మారింది. అయితే తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల టాలీవుడ్‌ లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశం ఈ అమ్మాయికి దక్కలేదు. చిన్నా చితక పాత్రల్లో నటిస్తూ దాదాపు దశాబ్ద కాలం కెరీర్ లో ముందుకు సాగింది.

బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ఇక సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఈమె అందమైన ఫోటోలు షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఇలా క్లోజప్ లో తన అందమైన క్యూట్‌ ఫేస్ ను మరియు క్లీ వేజ్‌ షో చేస్తూ నెటిజన్స్‌ కి మతి పోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

పలు సినిమాలు, సిరీస్ ల్లో నటించిన ఈ అమ్మడు గత రెండు మూడు సంవత్సరాలుగా వెండి తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. అయితే ఇలాంటి అందమైన ఫోటో లను మరిన్ని షేర్‌ చేస్తే తప్పకుండా తెలుగు లేదా తమిళ్ భాషల నుండి అయినా ఆఫర్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు.