Begin typing your search above and press return to search.

బ్యాక్ లెస్ టాప్ లో తేజస్వి అందాల మోత

ఆ సినిమాలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న పాత్ర చేసింది ఈ హైదరాబాద్ అమ్మడు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 11:30 AM GMT
బ్యాక్ లెస్ టాప్ లో తేజస్వి అందాల మోత
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు, వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మాదివాడ. ఆ సినిమాలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న పాత్ర చేసింది ఈ హైదరాబాద్ అమ్మడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా కూడా యాక్ట్ చేసింది.


ఇక ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని ఈ చిన్నది.. ఐస్ క్రీమ్ సినిమా టైమ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది.


అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. కానీ ఫైనల్ వరకు వెళ్లలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పాల్గొన్న ఈ బ్యూటీ.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2021లో ఆమె నటించిన కమిట్మెంట్ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట రోజూ హీటెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. రోజు రోజుకూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ ఫొటోలు షేర్ చేసి మతిపోగొడుతోంది. కుర్రకారును గాలం వేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు సెగలు పుట్టిస్తున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. బాక్ లెస్ టాప్, పొట్టి నిక్కర్ లో కిర్రాక్ పోజులు ఇచ్చింది. బ్లాక్ జాకెట్ పట్టుకుని వెనక్క తిరిగి బ్లాక్ షో చేసింది.

హీటెక్కించే అందాలు ఆరబోస్తూ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్నదాని ఫొటోలకు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇన్ స్టాగ్రామ్ లో తేజస్వికి 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.