Begin typing your search above and press return to search.

తేజ‌స్ టీజ‌ర్: క్వీన్ ఈజ్ బ్యాక్ ఎగైన్

కంగనా రనౌత్ కొన్ని వ‌ర‌స ప‌రాజ‌యాలతో తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌లైవి- ధాక‌డ్- చంద్ర‌ముఖి 2 చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లు అయ్యాయి

By:  Tupaki Desk   |   2 Oct 2023 6:59 AM GMT
తేజ‌స్ టీజ‌ర్: క్వీన్ ఈజ్ బ్యాక్ ఎగైన్
X

కంగనా రనౌత్ కొన్ని వ‌ర‌స ప‌రాజ‌యాలతో తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌లైవి- ధాక‌డ్- చంద్ర‌ముఖి 2 చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లు అయ్యాయి. దీంతో ఈ భామ‌ తదుపరి చిత్రం తేజస్ పైనే హోప్స్ పెట్టుకుంది. తాజాగా తేజ‌స్ టీజర్‌ను అక్టోబర్ 2, సోమవారం గాంధీ జయంతి సందర్భంగా స్వ‌యంగా కంగ‌న‌ ఆవిష్కరించారు. జాతీయ అవార్డు విజేత, మేటి న‌టి కంగ‌న ర‌నౌత్ ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్‌గా నటించారు. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. చ‌క్క‌ని నేప‌థ్యంలో అద్భుత‌మైన‌ డైలాగ్ తో కంగ‌న ఆక‌ట్టుకుంది. 'మన దేశంపై ప్రేమ కోసం' తేజ‌స్ టేకాఫ్ కోసం సిద్ధమవుతోంద‌ని టీజర్ లో చూపించారు.

ఈ టీజ‌ర్ లో క్వీన్ కంగ‌న నిజ‌మైన వైమానిక ద‌ళ కమాండ‌ర్ ని త‌ల‌పించింది. భార‌త‌దేశం కోసం పోరాడిన‌ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా కంగ‌న లుక్ కూడా యాప్ట్ అనిపించింది. టీజ‌ర్ ని షేర్ చేసిన కంగ‌న ఇలా వ్యాఖ్యానించింది ''మన దేశం 'ప్రేమ కోసం' బయలుదేరడానికి సిద్ధంగా ఉంది! భారత్ కో ఛేదోగే తో చోడేంగే నహీ. అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల‌వుతుంది'' అని వ్యాఖ్య‌ను జోడించింది. ఈ టీజ‌ర్ చూసిన తర్వాత గూస్‌బంప్స్ అని కామెంట్స్ విభాగంలో ప్రత్యుత్తరం ఇచ్చిన కంగ‌న‌ అభిమానులు టీజర్‌ను అభినందిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు దీనిని టామ్ క్రూజ్ నటించిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌తో పోలుస్తూ 'ఇండియాస్ టాప్ గన్' అని కూడా ప్ర‌శంసించారు. క్వీన్ ఈజ్ బ్యాక్..అద్భుతమైన టీజర్‌ని చూశాం అంటూ మ‌రికొంద‌రు వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రం. ఇటీవ‌లే తేజ‌స్ కొత్త పోస్టర్‌లో సినిమా కొత్త విడుదల తేదీని అక్టోబర్ 27గా పేర్కొన్నారు.

ముందుగా అక్టోబర్ 20 న థియేట‌ర్ల‌లోకి రావాలని అనుకున్నారు. కానీ టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతి సనన్ నటించిన డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ గణపత్: ఎ హీరో ఈజ్ బోర్న్ .. మల్టీ-స్టారర్ రొమాంటిక్ కామెడీ యారియాన్ 2 చిత్రాల‌తో బిగ్ ఫైట్ ని ఆప‌డానికి మేకర్స్ తేజస్‌ను ఒక వారం పాటు వాయిదా వేశారు. దళపతి విజయ్ -లియో, నందమూరి బాలకృష్ణ -భగవంత కేసరి- శివ రాజ్‌కుమార్ -ఘోస్ట్ కూడా అక్టోబర్ 19 న హిందీ డబ్బింగ్ భాషలలో విడుదల కానున్నాయి. కాబట్టి తేజస్ ఆ వారాంతంలో ఇత‌ర సినిమాల‌తో క‌లిసి విడుద‌ల కాదు. ఏరియల్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ తేజస్ ని రోనీ స్క్రూవాలా తన ప్రొడక్షన్ హౌస్ ఆర్‌ఎస్‌విపి మూవీస్ లో నిర్మించారు. తొలి చిత్ర ద‌ర్శ‌కుడు సర్వేష్ మేవారా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఎయిర్ ఫోర్స్ డే రోజున అంటే అక్టోబర్ 8న విడుదల కానుంది.