Begin typing your search above and press return to search.

తేజ సజ్జా.. మళ్ళీ పెద్దదే దించుతున్నాడుగా..

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సెస్ అందుకున్న నటుడు తేజా సజ్జా

By:  Tupaki Desk   |   16 April 2024 4:05 AM GMT
తేజ సజ్జా.. మళ్ళీ పెద్దదే దించుతున్నాడుగా..
X

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సెస్ అందుకున్న నటుడు తేజా సజ్జా. ఈ సినిమాకి ముందు లో బడ్జెట్ హీరోగా ఉన్న తేజా హనుమాన్ తో ఏకంగా టైర్ 2 స్టార్స్ జాబితాలో చేరిపోయాడు. ఈ నేపథ్యంలో తేజాతో బడా నిర్మాతలు సినిమాలు చేయడానికి ముందుకి వస్తున్నారు. భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలని తేజా కోసం ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తేజా సజ్జాతో ఒక సినిమాని నిర్మిస్తోంది.

కార్తిక్ ఘట్టమని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మూవీ కోసం ఏకంగా 40 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చుపెడుతున్నారంట. ఈగల్ తర్వాత కార్తిక్ ఘట్టమనేనితో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేస్తోన్న రెండో సినిమా ఇది. ఈగల్ కి కథ అందించిన మణిబాబు కరణం ఈ చిత్రానికి కూడా స్టోరీ సమకూర్చడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ చిత్ర యూనిట్ నుంచి వచ్చింది. ఏప్రిల్ 18న మూవీ టైటిల్ రిలీజ్ చేస్తామని డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తేజా సజ్జా స్టైలిష్ అవతార్ లో ఒక కత్తి పట్టుకొని డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ బట్టి ప్రస్తుతం చేస్తోన్న మూవీ కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. హనుమాన్ మూవీ కంప్లీట్ ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ నేపథ్యంలో జరిగే కథగా చూపించారు.

అయితే కార్తీక్ ఘట్టమనేని మాత్రం ప్రస్తుతం చేస్తోన్న సినిమాని సిటీ బ్యాక్ డ్రాప్ లోనే ప్రెజెంట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ నెంబర్ 36గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సూపర్ యోధ తరహాలో తేజా సజ్జా పాత్ర ఈ చిత్రంలో ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. టైటిల్ తో పాటుగా ఏప్రిల్ 18న మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారంట. ఈ గ్లింప్స్ తోనే ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంధనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పాన్ ఇండియా లెవల్ లోనే ఈ సినిమాని కూడా ప్రెజెంట్ చేయబోతున్నారు. లర్జర్ దెన్ లైఫ్ అనేలా ఈ సినిమా కథ ఉండబోతోందంట. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాడు. అతని సినిమాల విజువల్ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి తేజా సజ్జాతో చేస్తోన్న సినిమాతో కార్తిక్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.