Begin typing your search above and press return to search.

జై హనుమాన్ - హనుమంతు... బ్యాడ్‌ న్యూస్‌

ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   18 April 2024 2:13 PM GMT
జై హనుమాన్ - హనుమంతు... బ్యాడ్‌ న్యూస్‌
X

ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ చరిత్రలోనే ఏ సంక్రాంతి సినిమా సాధించని వసూళ్లను హనుమాన్ దక్కించుకోవడంతో సీక్వెల్‌ పై అంచనాలు భారీగా పెరిగాయి.

శ్రీరామ నవమి సందర్భంగా హనుమాన్ సీక్వెల్‌ జై హనుమాన్‌ కి సంబంధించిన పోస్టర్‌ ను విడుదల చేసి ప్రేక్షకులకు కచ్చితంగా ఓ మంచి సినిమా ను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ను కలిగించారు. జై హనుమాన్‌ సినిమా గురించిన పుకార్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి.

అందులో ప్రధానంగా జై హనుమాన్‌ లో తేజా సజ్జ పాత్ర పెద్దగా ఉండక పోవచ్చు, అసలు సీక్వెల్‌ లో తేజా సజ్జ ఉన్నాడా లేడా అన్నట్లుగా పాత్ర ఉంటుంది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇటీవల తేజ మాట్లాడిన మాటలు మరియు ఇప్పటికే సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే జై హనుమాన్‌ లో రాముడు, ఆంజనేయుడి పాత్రలు ప్రధానంగా ఉండబోతున్నాయి. కనుక హనుమంతు సెంటర్‌ గా కథ ఉండదు అని తేలిపోయింది.

కనుక జై హనుమాన్ లో హనుమంతు పాత్ర పరిమితంగానే ఉంటుంది. అందుకే ఇతరు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తేజా సజ్జా కమిట్‌ అవుతున్నాడు. జై హనుమాన్‌ భారీగా రూపొందబోతుంది. కనుక అందులో తేజ సజ్జ చిన్న పాత్ర పోషించినా కూడా కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అని కొందరు భావిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం జై హనుమాన్ లో తేజా హీరో కాదా.. ఇది ఆయన ఫ్యాన్స్ కి బ్యాడ్‌ న్యూస్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

వచ్చే ఏడాదికి ఈ సీక్వెల్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మేకర్స్‌ చెబుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. కనుక షూటింగ్‌ ను వెంటనే మొదలు పెడితే వచ్చే ఏడాది సినిమా విడుదల చేయడం పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.