Begin typing your search above and press return to search.

వ‌రుస సినిమాల‌తో యువ‌హీరో స్పీడ్

అయితే ఈ సినిమాతో పాటు మ‌రో చిత్రంలోను తేజ న‌టిస్తున్నార‌ని తెలిసింది. నిజానికి యువ‌హీరో తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ అతడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాడని తెలిసింది.

By:  Tupaki Desk   |   18 Feb 2024 5:32 AM GMT
వ‌రుస సినిమాల‌తో యువ‌హీరో స్పీడ్
X

వ‌రుస‌గా భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటున్నాడు యువ‌హీరో తేజ స‌జ్జా. 'హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ సీక్వెల్ 'జై హనుమాన్' కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ బృందం స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. ఈ చిత్రం 2025 విడుదల కానుంది. ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడు. ఒక అగ్ర నటుడు హనుమంతుని పాత్రలో న‌టించ‌నుండగా, తేజ సజ్జా త‌న‌ పాత్రను పునరావృతం చేయనున్నారు.

అయితే ఈ సినిమాతో పాటు మ‌రో చిత్రంలోను తేజ న‌టిస్తున్నార‌ని తెలిసింది. నిజానికి యువ‌హీరో తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ అతడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాడని తెలిసింది. యాక్షన్‌ అడ్వెంచర్ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

హ‌నుమాన్ చిత్రం తేజ స‌జ్జా ఫేట్‌ని మార్చేసింది. హిందీలోను ఇక‌పై పెద్ద‌గా మార్కెట్ ని ఛేజిక్కించుకోనున్నాడు. అందుకే జై హ‌నుమాన్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ తెలివైన ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. పీపుల్స్ మీడియా అత‌డిపై భారీ పెట్టుబ‌డులు పెడుతోంద‌ని తెలిసింది. పీపుల్స్ మీడియా నిర్మించే చిత్రానికి పలువురు ప్రముఖ సాంకేతిక నిపుణులు, పాపుల‌ర్ నటీనటులు పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఇత‌ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తోను తేజ స‌జ్జా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలిసింది.