Begin typing your search above and press return to search.

లక్‌ అంటే ఈ కుర్ర హీరోదే...!

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో హీరోలకు మంచి కథలు దొరకడం అంత ఈజీ కాదు

By:  Tupaki Desk   |   2 Jan 2024 11:48 AM GMT
లక్‌ అంటే ఈ కుర్ర హీరోదే...!
X

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో హీరోలకు మంచి కథలు దొరకడం అంత ఈజీ కాదు. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ కథలు, కమర్షియల్‌ కథలు ఎక్కువగా స్టార్‌ కిడ్స్ వద్దకు, స్టార్‌ ఫ్యామిలీ హీరోల వద్దకు వెళ్తూ ఉంటాయి. అలాంటిది తేజ సజ్జా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మంచి కాన్సెప్ట్‌ కథలు దక్కించుకుంటూ ఉన్నాడు.

జాంబీ రెడ్డి సినిమా కథ ఎంతటి వైవిధ్యభరితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహా లో హనుమాన్‌ సినిమా కూడా ఉంటుదని అంటున్నారు. సూపర్‌ మ్యాన్‌ స్టోరీ అంటూ హనుమాన్‌ ను ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి తేజ హనుమాన్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

హనుమాన్‌ విడుదల అవ్వకుండానే మరో సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ సినిమాను తేజ ఓకే చేశాడు.. ఆ సినిమా షూటింగ్‌ దాదాపుగా సగం పూర్తి అయిందని సమాచారం అందుతోంది. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ హీరోగా ఆ సూపర్‌ హీరో కథ సినిమా ఇప్పటికే ప్రారంభం అయింది.

కార్తీక్‌ కి రవితేజ నుంచి ఈగల్ ఆఫర్‌ రావడంతో పాటు తేజ హనుమాన్ సినిమాను భారీ స్థాయిలో చేయాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను పక్కన పెట్టడం జరిగింది. హనుమాన్‌ విడుదల అయిన వెంటనే తేజ మరియు కార్తీక్ లు కలిసి ఆ సినిమా బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి ఇదే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. వరుసగా సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ సినిమా ఛాన్స్ దక్కించుకున్న తేజ నిజంగా లక్కీ హీరో అంటూ మీడియా వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు కామెంట్ చేస్తున్నారు.