Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో ని అనుకుంటున్నావా తేజ?

బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తేజ హీరోగా కెరీర్ ను ఆరంభించి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

By:  Tupaki Desk   |   19 April 2024 8:30 AM GMT
స్టార్‌ హీరో ని అనుకుంటున్నావా తేజ?
X

బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తేజ హీరోగా కెరీర్ ను ఆరంభించి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తేజ హీరోగా నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హనుమాన్‌ సినిమా తేజ కి హీరోగా మంచి బ్రేక్‌ ని ఇచ్చింది అనడంలో సందేహం లేదు.

హనుమాన్‌ సినిమా హిట్‌ తో తేజ వద్దకు ఎంతో మంది దర్శక నిర్మాతలు అడ్వాన్స్ తో వెళ్తున్నారు. హనుమాన్‌ మేకింగ్‌ సమయంలోనే తన వద్దకు పదుల సంఖ్యలో ఆఫర్లు వచ్చాయని, కానీ నేను హనుమాన్‌ పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాకు కమిట్‌ అవుతాను అంటూ తేజ ఆ సినిమాలన్నింటిని కూడా తిరస్కరించాడు.

ఇప్పటికి కూడా తేజ ఎన్నో ప్రాజెక్ట్‌ లకు నో చెబుతున్నాడు. గతంలో తీసుకున్న పారితోషికంకు పది రెట్లు ఆఫర్‌ చేసినా కూడా తేజ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఆయన మిరాయ్‌ అనే సినిమాను చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ ను చూస్తూ ఉంటే కచ్చితంగా మరో భారీ విజయం ఖాయం అనిపిస్తుంది.

అందుకే తేజ వద్దకు భారీ మొత్తంలో అడ్వాన్స్ తో ప్రముఖ నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారట. కానీ తేజ మాత్రం సున్నితంగా వారందరికీ నో చెబుతున్నాడు. పెద్ద నిర్మాణ సంస్థలకు కూడా నో చెబుతున్న తేజ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమా తర్వాత సినిమాను మొదలు పెట్టడానికి నువ్వు ఏమైనా స్టార్‌ హీరోవా.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నావు. కనుక సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేయి అంటూ కొందరు తేజ కి ఉచిత సలహాలు ఇస్తున్నారట. కానీ తేజ మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు.

వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను ఒప్పేసుకుంటే సినిమాల సంఖ్య పెరుగుతుంది కానీ హనుమాన్ వంటి సినిమాలు రావు. అందుకే తేజ కాస్త జాగ్రత్తగానే సినిమాలను ఎంపిక చేసుకోవడం మంచిది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎవరు ఏమన్నా కూడా తేజ వన్‌ బై వన్‌ అన్నట్లుగా సినిమాలు చేయడం ఉత్తమం.