Begin typing your search above and press return to search.

తేజ మిరాయ్.. మళ్ళీ ఇదెక్కడి ట్విస్టు

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మిరాయ్ సినిమా షూటింగ్ హనుమాన్ చిత్రం రిలీజ్ కు ముందు కొంత భాగం జరిగింది.

By:  Tupaki Desk   |   14 March 2024 9:59 AM GMT
తేజ మిరాయ్.. మళ్ళీ ఇదెక్కడి ట్విస్టు
X

హనుమాన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.300 కోట్లకుపైగా రాబట్టి లాభాల పంట పండించింది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇప్పటికే పలు చిత్రాలతో ఆకట్టుకున్న తేజ.. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

అయితే హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా కొత్త సినిమాపై టాలీవుడ్ సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మరోవైపు, హనుమాన్ తో వచ్చిన క్రేజ్ ను కంటిన్యూ చేయడానికి తేజ కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇక తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హనుమాన్ మూవీ రిలీజ్ కు ముందే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యంగ్ హీరో.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మిరాయ్ సినిమా షూటింగ్ హనుమాన్ చిత్రం రిలీజ్ కు ముందు కొంత భాగం జరిగింది. స్టార్ హీరోలు మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ త్వరలో మొదలవుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీలో కొన్ని మార్పులు చేస్తున్నారట మేకర్స్. స్క్రిప్ట్ లో చాలా భాగం మార్చుతున్నారట.

హనుమాన్ మూవీతో తేజ సజ్జాకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. గోవాలో మిరాయ్ టోటల్ స్క్రిప్ట్ కు మరమ్మతులు చేస్తున్నారట. కొత్తగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ను యాడ్ చేస్తున్నారట. ఇప్పటికే షూట్ చేసిన సీన్లను కూడా రీషూట్ చేయనున్నారట. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇదే జరుగుతుందని సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

మిరాయ్ మూవీలో తేజ సజ్జా సరసన ఇంకా ఎవరు నటించనున్నారో ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. విలన్ గా మంచు మనోజ్ అలరించనున్నారు. మరో లీడ్ రోల్ లో దుల్కర్ సల్మాన్ సందడి చేయనున్నారు. రూ.40 కోట్ల భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత జై హనుమాన్ షూటింగ్ లో తేజ సజ్జా పాల్గొనున్నట్లు సమాచారం.