Begin typing your search above and press return to search.

మిరాయ్ కూడా మిరకిల్స్ చేస్తే

మరి ఇవేవి లేకుండా తేజా సజ్జా సోలో సినిమాకు 40 కోట్ల బడ్జెట్ అంటే రిస్క్ చేస్తున్నారా అని కొందరు డౌట్ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 12:30 PM GMT
మిరాయ్ కూడా మిరకిల్స్ చేస్తే
X

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారిన తేజా సజ్జ సమంతతో చేసిన ఓ బేబీ తో మెప్పించాడు. ఆ సినిమా తర్వాత జాంబీ రెడ్డితో సోలో హిట్ అందుకున్నాడు తేజా. ఇక లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు తేజా సజ్జ. హనుమాన్ సినిమా సక్సెస్ లో హీరోగా తేజా సజ్జ ఎఫర్ట్స్ కూడా ప్రశంసించేలా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు తేజా.

హనుమాన్ సినిమా తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టిస్తుంది. హనుమాన్ ఎఫెక్ట్ తో తేజా సజ్జ నెక్స్ట్ సినిమా భారీ హైప్ తో వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జ సినిమా వస్తుంది. ఈ సినిమాకు మిరాయ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించే ప్లానింగ్ చేస్తున్నారట. హనుమాన్ సినిమాను 30 కోట్లకు అటు ఇటుగా పూర్తి చేయగా ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ టాలెంట్, వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మిగతా అంశాలన్నీ కలిసి వచ్చాయి.

మరి ఇవేవి లేకుండా తేజా సజ్జా సోలో సినిమాకు 40 కోట్ల బడ్జెట్ అంటే రిస్క్ చేస్తున్నారా అని కొందరు డౌట్ పడుతున్నారు. అయితే హనుమాన్ కథ వేరు కానీ మిరాయ్ కథ కూడా అద్భుతంగా వచ్చిందని ఆ కథకు ఆ బడ్జెట్ పర్ఫెక్ట్ అని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే కేవలం తేజా మాత్రమే కాదు సినిమాలో మంచు మనోజ్ నెగిటివ్ రోల్ లో నటిస్తాడని అంటున్నారు. అంతేకాదు ఒక ఇంపార్టెంట్ రోల్ లో దుల్కర్ సల్మాన్ ని తీసుకోవాలని చూస్తున్నారు. తేజా సజ్జతో పాటుగా మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో భాగమైతే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కు అనుకుంటున్న బడ్జెట్ యాక్సెప్టబుల్ అని చెప్పొచ్చు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు హీరోగా మారిన తేజా సజ్జ కెరీర్ విషయంలో మంచి ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా ఓ సూపర్ హిట్ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇక రాబోతున్న మిరాయ్ కూడా మిరకిల్స్ చేస్తే యువ హీరోల్లో తేజా సజ్జ పేరు కూడా అందరు మాట్లాడుకునేలా ఉంటుంది.