Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేమ్ లో సూపర్ హీరోస్.. ఇద్దరిలో కామన్ ఇదే!

తాజాగా అలాంటి పిక్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   20 March 2024 4:06 PM GMT
ఒకే ఫ్రేమ్ లో సూపర్ హీరోస్.. ఇద్దరిలో కామన్ ఇదే!
X

సినీ ఇండస్ట్రీలో కొందరి కలయికలు.. ఆ టైమ్ లో వారు దిగిన పిక్స్ చూడముచ్చటగా ఉంటాయి. నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో వైరల్ చేస్తుంటారు. తమ సోషల్ మీడియా వాల్స్ లో వాటిని షేర్ చూస్తూ క్రేజీ క్యాప్షన్స్ ఇస్తుంటారు. ఒక రెండు రోజుల పాటు ఎక్కడ చూసినా ఆ ఫొటోలే కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి పిక్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.


ఆ పిక్ ఎవరిదో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, శాండిల్ వుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టిది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇటీవల ముంబయిలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు వీరిద్దరు విచ్చేశారు. ఆ సమయంలో తేజ, రిషబ్ శెట్టి దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. ఇద్దరూ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసి అట్రాక్ట్ అవుతున్న నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ప్రస్తుతం ఇద్దరూ తమ నెక్స్ట్ సినిమాలతో బిజీగా ఉన్నారని, సో ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజన్లు. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే సూపర్ గా ఉంటుంది కదా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. వీరిద్దరినీ హీరోలుగా ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేయొచ్చుగా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇద్దరూ సెల్ఫ్ మేడ్ స్టార్ట్స్ అని, సూపర్ టాలెంట్ ఉందని చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీలో మరింత ఎత్తు ఎదగాలని కోరుకుంటున్నారు.

రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ తో బిజీగా ఉన్నారు. కాంతార సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రీక్వెల్ పై అటు ప్రేక్షకుల్లో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం రిషబ్.. గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఈ మూవీలో ఆయన పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో చూసిన దానికంటే భిన్నంగా ఉంటుందట.

ఇక హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు తేజ సజ్జా. సంక్రాంతికి వచ్చి నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. తేజ సజ్జా క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఇటీవల మిరాయ్ మేకర్స్.. స్క్రిప్ట్ లో భారీ మార్పులు, చేర్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి వీరిద్దరి కొత్త సినిమాలు ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.