Begin typing your search above and press return to search.

తేజ సజ్జ న్యూ మూవీ బడ్జెట్ అన్ని కోట్లా??

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. ఇటీవల సంక్రాంతికి వచ్చి హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 April 2024 8:08 AM GMT
తేజ సజ్జ న్యూ మూవీ బడ్జెట్ అన్ని కోట్లా??
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. ఇటీవల సంక్రాంతికి వచ్చి హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో హనుమంతు పాత్రలో తన యాక్టింగ్ తో అదరగొట్టారు తేజ. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ సీక్వెల్ లో కూడా లీడ్ రోల్ పోషించనున్నారు.

అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడేళ్ల వయసులోనే సినీ కెరీర్ స్టార్ట్ చేసిన తేజ సజ్జ.. టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి పలువురు స్టార్స్ సినిమాల్లో నటించారు. తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. 28 ఏళ్ల తేజ సజ్జ గతేడాది ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం. 2019లో సమంత లీడ్ రోల్ లో నటించిన ఓ బేబీ మూవీలో స్పెషల్ రోల్ లో కనిపించారు.

ఆ తర్వాత హీరోగా మారి వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోగా ఫస్ట్ మూవీ జాంబిరెడ్డితో మంచి హిట్ అందుకున్నారు. అనంతరం ఇష్క్, అద్భుతం సినిమాలు చేశారు. కానీ హనుమాన్ మూవీ.. తేజ సజ్జ కెరీర్ మలుపు తిప్పేసింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాతో తేజ సజ్జ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తేజ అప్ కమింగ్ మూవీస్ పై అందరి దృష్టి పడింది.

ప్రస్తుతం తేజ సజ్జ.. మిరాయ్ మూవీతో బిజీ గా గడుపుతున్నారు. హనుమాన్ సినిమా కన్నా ముందే ఈ మూవీ స్టార్ట్ చేశారు తేజ. అప్పుడు కాస్త షూటింగ్ జరగ్గా.. ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. రవితేజ ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ బడ్జెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రూ.40-45 కోట్ల ఖర్చుతో ఈ మూవీ తీస్తున్నారని తెలుస్తోంది. మొదట్లో ఈ మూవీ బడ్జెట్ తక్కువే అనుకున్నారట. కానీ తేజ సజ్జకు పెరిగిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో బడ్జెట్ భారీగా పెరిగిందట. ఆల్ మోస్ట్ హనుమాన్ కన్నా కూడా ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందన్నమాట. 2024లోనే విడుదల కానున్న ఈ మూవీతో తేజ ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.