Begin typing your search above and press return to search.

తేజాకి కోప‌మోస్తే తిట్టేది హీరోయిన్ అమ్మ‌నా!

కెమెరా ముందుకొచ్చిన ఏ న‌టి అయినా..న‌డుడైనా ఆయ‌న చెప్పినట్లు చేయాల్సిందే. ఆ విష‌యంలో తేడా వస్తే తేజ స‌హ‌నాన్ని ప‌రీక్షించిన‌ట్లే.

By:  Tupaki Desk   |   29 Nov 2023 1:30 PM GMT
తేజాకి కోప‌మోస్తే తిట్టేది హీరోయిన్ అమ్మ‌నా!
X

డైరెక్ట‌ర్ తేజ సెట్ లో సీరియ‌స్ గా ఉంటార‌ని ఆయ‌న‌తో ప‌నిచేసిన న‌టీన‌టులు చెబుతుంటారు. ఆయ‌న సెట్ కి వ‌చ్చిన త‌ర్వాత న‌టీన‌టులంతా స‌మాన‌మే. హీరో..హీరోయిన్ అని పెద్ద పీట వేసే సీన్ ఉండ‌దు. న‌టీనటులంతా ఆయ‌న ముందు స‌మాన‌మే. కెమెరా ముందుకొచ్చిన ఏ న‌టి అయినా..న‌డుడైనా ఆయ‌న చెప్పినట్లు చేయాల్సిందే. ఆ విష‌యంలో తేడా వస్తే తేజ స‌హ‌నాన్ని ప‌రీక్షించిన‌ట్లే.

అంద‌రి ముందు ఆయ‌న తిడ‌తారాని...అస‌హ‌నం వ్య‌క్తం చేస్తార‌ని చాలా మంది న‌టీన‌టులు గ‌తంలో రివీల్ చేసారు. ఆయ‌న‌లా రియాక్ట్ కావ‌డం వ‌ల్లే త‌మ లో పెర్పార్మెన్స్ అంత గొప్ప‌గా వ‌స్తుంద‌ని పొగిడేస్తారు.నిజ‌మే ఆయ‌న సినిమాలతో ఎంతో మంది కొత్త వాళ్లు ప‌రిచ‌యం అయి స్టార్లు అయ్యారు. స్టార్లు లేకుండా త‌న సినిమా చేసి త‌న బ్రాండ్ తో మార్కెట్ లోకి తీసుకెళ్లే ద‌ర్శ‌కుడాయ‌న‌.

అలాంటి డైరెక్ట‌ర్ గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఆయ‌న‌కు కోపం వ‌స్తే దండించేది హీరోయిన్ కాద‌ట‌.. హీరోయిన్ అమ్మ‌ని అని తెలుగు న‌టి సంతోషి తెలిపింది. `తేజగారికి నాపై కోపం వస్తే అక్కడే ఉన్న మా మదర్ ను పిలిచి అసహనాన్ని ప్రదర్శించేవారు. దాంతో మా మదర్ అందరి ముందూ నన్ను తిట్టేసేది. కెరియర్ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో నాకు సరైన గైడెన్స్ లభించలేదు.

అందువలన నేను ఎక్కువ సినిమాలు చేయ లేకపోయాను` అని తెలిపింది. నితిన్ హీరోగా న‌టించిన `జై` సినిమాతో సంతోషి తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌క‌పోవ‌డంతో ఆమె పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. సంతోషి తేజ గురించి తెలియ‌ని ఓ కొత్త విష‌యాన్ని రివీల్ చేసింది. దీంతో కొత్త డౌట్ మొద‌లైంది. ఆయ‌న తిట్టేది హీరోయిన్ల‌ను కాదా? హీరోయిన్లు అమ్మ‌నా? అంటూ నెటి జ‌నులు పోస్ట్ లు చేస్తున్నారు.