Begin typing your search above and press return to search.

బ్యాక్ గ్రౌండ్ స్టార్స్ పై తేజ సజ్జా కామెంట్స్..

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2025 5:00 PM IST
బ్యాక్ గ్రౌండ్ స్టార్స్ పై తేజ సజ్జా కామెంట్స్..
X

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్స్ కే అటు మీడియా కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తుందని హీరో నానిని మొదలుకొని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరకు ఇలా ఎంతోమంది నెపోకిడ్స్ గురించి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్స్ కి కూడా తిప్పలు తప్పడం లేదు అంటూ హీరో తేజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నిజానికి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గత కొన్ని ఇంటర్వ్యూలను మనం గమనిస్తే.. ఆమె బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారి కంటే నెపోకిడ్స్ కి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తేజ సజ్జ చేసిన కామెంట్స్ వింటుంటే.. అప్పుడు జాన్వీ చేసిన కామెంట్లు నిజమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ.. తొలిసారి సమంత - నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఓ బేబీ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారిన ఈయన.. హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయారు. ఇటీవల వచ్చిన మిరాయ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని యంగ్ హీరోలు కూడా సాధించని రికార్డులను క్రియేట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న తేజ సజ్జ తాజాగా ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగానే కెరియర్ విషయాలు, తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా ఆయన స్పందించారు. తేజ మాట్లాడుతూ.." నేషనల్ అవార్డు వచ్చిన చిత్రాలపై విమర్శలు చేస్తున్నారు. పెద్దపెద్ద హీరోలను కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ట్రోల్స్ చేస్తున్నారు కదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్లలేము. ఇప్పుడు కాకపోతే కొన్నేళ్ల తర్వాత అయినా కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. సమయం వచ్చినప్పుడు మన విలువ అందరికీ తెలుస్తుంది.

ముఖ్యంగా విమర్శించే వారిని దృష్టిలో పెట్టుకుంటే మనం భవిష్యత్తులో ముందడుగు వేయలేము. నిజానికి మనకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇక్కడిదాకా వచ్చాము అని చెప్పడం కంటే.. ఆడియన్స్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాము అని చెప్పుకోవడం చాలా బెటర్.. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకి కూడా ఇదే రేంజ్ లో ఇబ్బందులు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి" అంటూ ఆయన తెలిపారు. మొత్తానికైతే తేజ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెపోకిడ్స్ కి కూడా తిప్పలు తప్పవా అంటూ అభిమానులు నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏ రంగంలోనైనా సత్తా చాటాలంటే ప్రతిభతో పాటూ అదృష్టం కూడా ఉండాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.