తేజ సజ్జా 'మిరాయ్'.. రంగంలోకి బాలీవుడ్ బడా నిర్మాత?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మిరాయ్ మూవీకి గౌర హరి సంగీతం అందిస్తున్నారు.
By: Tupaki Desk | 25 July 2025 8:27 AM ISTబ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమా తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ మిరాయ్ తో బిజీగా ఉన్నారు. సూపర్ హీరో అడ్వెంచర్ యాక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మిరాయ్ మూవీకి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సెప్టెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.
రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా మేకర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైబ్ ఉంది అంటూ సాగే సాంగ్ ను జులై 26వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో సూపర్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. అందులో తేజ సజ్జా, రితికా నాయక్ రొమాంటిక్ మూడ్ లో కనిపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంది.
అదే సమయంలో ఇప్పుడు సినీ వర్గాల్లో మిరాయ్ కు సంబంధించి కొత్త అప్డేట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్.. మిరాయ్ నిర్మాణ భాగస్వామిగా మారనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరణ్ జోహర్.. సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని, ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
అదే కనుక నిజమే.. ఇప్పటికే సౌత్ ఇండియా బడా చిత్రాలకు మద్దతు ఇచ్చిన ధర్మ ప్రొడక్షన్స్.. మరొక వ్యూహాత్మక అడుగువేసినట్లు అవుతుంది. బాహుబలి, దేవర వంటి వివిధ చిత్రాల్లో ధర్మ ప్రొడక్షన్స్ ప్రమేయం ఉన్నందున, మిరాయ్ టీమ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తే.. పాన్ ఇండియా లెవెల్ లో ఆ సినిమా రేంజ్ పెరగనుంది.
అయితే ధర్మ ప్రొడక్షన్స్ వల్ల దేవర మూవీ.. నార్త్ లో మంచి వసూళ్లు సాధించిందని ఇప్పటికే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మిరాయ్ కూడా భారీ కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరి మిరాయ్ సినిమాకు ధర్మ ప్రొడక్షన్స్.. నిర్మాణ భాగస్వామిగా మారిందో లేదో తెలియాలంటే మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
