Begin typing your search above and press return to search.

మిరాయ్ వైబ్ మొదలైంది!

హనుమాన్‌ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తేజ సజ్జ, మరోసారి సూపర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2025 11:05 AM IST
మిరాయ్ వైబ్ మొదలైంది!
X

హనుమాన్‌ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తేజ సజ్జ, మరోసారి సూపర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ మిరాయ్ ఇప్పటికే టీజర్‌ ద్వారా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై టీజర్ విడుదలైనప్పటి నుంచే, భారీ విజువల్స్‌, కొత్త కథనంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.


ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా మొదలుపెట్టనున్నారు. మిరాయ్ లోని ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది’ జూలై 26న విడుదల కాబోతోంది. పోస్టర్‌లో తేజ సజ్జ, రితికా నాయక్ జంటగా కనిపించగా, వీరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. గోల్డెన్ ఎనర్జీ స్పార్క్స్ మధ్యలో ఇద్దరూ స్టైలిష్ పోజ్ ఇవ్వడంతో, ఈ పాట ఎలా ఉంటుందోనని సంగీత ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.

తేజ సజ్జ డిఫరెంట్ లుక్‌తో, స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో హీరోగా మెరిసిపోతున్నారు. మరోవైపు, రితికా నాయక్ గ్లామరస్‌గా, తనదైన క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో స్పెషల్ వీఎఫ్ఎక్స్, మేజికల్ ఎనర్జీ ట్రైల్స్ ఉండటంతో సినిమాకు కొత్తదనాన్ని తెచ్చారు. ఈ మిరాయ్ సినిమా పూర్తిగా మైతో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతుండటం విశేషం.

ఈ సినిమాలో విలన్ గా మనోజ్ మంచు కనిపించబోతుండగా, శ్రీయ శరణ్, జయరాం, జగపతి బాబు లాంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ కార్తిక్ కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకోవడం సినిమాకు అదనపు హైప్‌ను తీసుకొచ్చింది. మణిబాబు కరణం డైలాగ్స్ రాయగా, ఆర్ట్ డైరెక్షన్‌ను శ్రీ నాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు. అన్ని విభాగాల్లోను టెక్నికల్ టీమ్ అత్యుత్తమంగా పని చేస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు వరుస బ్లాక్‌బస్టర్స్ తర్వాత, మిరాయ్ రూపంలో మరో పాన్ ఇండియా మేజర్ ప్రాజెక్ట్ లభించింది. టీజర్‌లో చూపించిన విజువల్ స్ఫెక్టాకిల్, సౌండ్ డిజైన్, గ్రాఫిక్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వాడినట్టు సమాచారం. ఇక సెప్టెంబర్ 5న ‘మిరాయ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో, 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల కానుంది.