Begin typing your search above and press return to search.

'మిరాయ్' టీజర్.. గూస్ బంప్స్ పక్కా..

హనుమాన్ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 May 2025 11:44 AM IST
మిరాయ్ టీజర్.. గూస్ బంప్స్ పక్కా..
X

హనుమాన్ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూపర్ యోధగా సినిమాలో కనిపించనున్నారు. అయితే అనౌన్స్మెంట్ నుంచే మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానున్న మిరాయ్ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ మంచి హోప్స్ పెట్టుకున్నారు.

ఇప్ప‌టికే సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, స్పెష‌ల్ గ్లింప్స్‌ లు సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. జ‌ర‌బోయేది మార‌ణ‌హోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. క‌లియుగంలో పుట్టిన ఏ శ‌క్తి దీన్ని ఆప‌లేదు అంటూ జ‌య‌రాం డైలాగ్‌ తో టీజ‌ర్ గ్రాండ్ గా మొదలైంది.

ఆ తర్వాత మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. ఇట్స్ మై టర్న్ అంటూ ఆసక్తి రేపారు. శ్రియ కీలక పాత్రలో కనిపించారు. ఇంతలో యోధగా తేజ.. తొమ్మిది పుస్తకాలు.. 100 ప్రశ్నలు.. ఒక స్టిక్.. బిగ్ అడ్వెంచర్ అంటూ టీజర్ ను మరో రేంజ్ లోకి తీసుకెళ్లారు. ఓవరాల్ గా టీజర్.. గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఏదేమైనా మిరాయ్ టీజర్ మాత్రం ఊహించని రతిలో ఉంది. మంచు మనోజ్, తేజ సజ్జా నటన అదిరిపోయింది. గౌర హరి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. టీజర్ లోని విజువల్స్ అయితే హాలీవుడ్ మూవీని తలపించినట్లు ఉన్నాయి. చివర్లో రాముని రాకపై చూపించిన విజువల్ ఊహించని రీతిలో ఉందనే చెప్పాలి.

ముఖ్యంగా నిర్మాతల రిచ్ వాల్యూస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉన్నాయి. మంచు మనోజ్, తేజ సజ్జా యాక్షన్ సీన్స్ లో ఎక్కడా అస్సలు కాంప్రమైజ్ అయినట్లు లేదు. ప్రతీ విషయంలో డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రితికా నాయక్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అలా టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ.. మెప్పిస్తూ.. దూసుకుపోతోంది. మూవీ బ్లాక్ బస్టర్ అనే నమ్మకం క్రియేట్ చేస్తోంది.