Begin typing your search above and press return to search.

తేజ సజ్జా 'మిరాయ్'.. అదే ఫుల్ ప్లస్సూ!

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్ లో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2025 5:00 PM IST
Mirai Release Date Update
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. హనుమాన్ చిత్రంతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న తేజ.. ఇప్పుడు మరో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అప్పుడే ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్ లో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న మిరాయ్ లో తేజ సూపర్ యోధగా సందడి చేయనున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో మూవీ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. మేకర్స్ జెట్ స్పీడ్ లో వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓవైపు పెండింగ్ పార్ట్ ను కంప్లీట్ చేస్తూనే.. మరోవైపు ఇప్పటికే సిద్ధమైన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుతున్నారట.

కొద్ది రోజుల క్రితం ప్రకటించిన రిలీజ్ తేదీకి కచ్చితంగా మూవీని విడుదల చేయాలని టార్గెట్ తో మేకర్స్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడా ఎలాంటి జాప్యం లేకుండా అనుకున్నట్లు వర్క్ ను చకచకా పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఆగస్టు 1వ తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.

అయితే దాని వెనుక ఉన్న ముందుచూపు.. సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఆగస్టులో భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్-2, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ, మరో స్టార్ హీరో ఉపేంద్ర 45 సహా పలు చిత్రాలు రెండో వారంలో విడుదల కానున్నాయి.

దీంతో మిరాయ్ వాయిదా పడుతుందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ సెకెండ్ వీక్ లో రిలీజ్ అవ్వనున్న చిత్రాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమనే చెప్పాలి. అందుకే అది తమకు లాభమని భావించి ఆగస్టు 1వ తేదీన రిలీజ్ చేయాలని మిరాయ్ మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ముందుచూపుతో ఇప్పటికే వర్క్స్ పూర్తి చేస్తున్నారని టాక్. అందుకే అంటారు పెద్దలు.. ముందుచూపు మంచిదే అని..