తుది మెరుగులు దిద్దుకుంటున్న 'మిరాయ్'
గత ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ సజ్జా ప్రస్తుతం 'మిరాయ్' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 25 May 2025 3:00 AM ISTగత ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ సజ్జా ప్రస్తుతం 'మిరాయ్' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తేజా మార్కెట్ భారీగా పెరిగింది. అందుకే ఆయనతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నిర్మాణ సంస్థ దాదాపుగా రూ.75 కోట్లతో నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ టీజర్‌ను త్వరలో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో టీజర్ విడుదలకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అతి త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. హనుమాన్ తర్వాత తేజ సజ్జా సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పబ్లిసిటీ స్టఫ్ సినిమాపై అంచనాలను పెంచింది అనడంలో సందేహం లేదు.
సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చివరి దశ షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు వేగం పెంచారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ కార్యక్రమాలు ముంబైలో జరుగుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ స్టంట్స్ కొరియోగ్రాఫర్ సమక్షయంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అందుకోసం భారీ సాంకేతిక పరిజ్ఞానం ను వినియోగిస్తున్నారని, భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి మిరాయ్ సినిమాను మరో తెలుగు సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను దర్శకుడు కార్తీక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
తేజ సజ్జా హనుమాన్ సినిమా సూపర్ హిట్‌తో పలు ఆఫర్లు సొంతం చేసుకున్నాడట. కానీ మిరాయ్ సినిమా కోసం పదుల కొద్ది సినిమాలను వదిలేశాడని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే మిరాయ్ సినిమా షూటింగ్ పూర్తి అయితే, ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్‌లో తేజా సజ్జా పాల్గొనబోతున్నాడు. మిరాయ్ విడుదల తర్వాతే కొత్త సినిమా కు కమిట్ అవ్వాలని తేజా భావిస్తూ ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. హనుమాన్ సినిమాను మించి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను మిరాయ్ పై మేకర్స్ పెట్టుకున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న ఈ సమయంలో మిరాయ్ రావడం ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం కాబోతుంది.
