బిగ్ స్టార్స్ 2 మిలియన్ రికార్డులు.. ఈ లిస్టులో తేజ సజ్జా కూడా..
తెలుగు సినిమాకి విదేశీ మార్కెట్ లో కూడా డిమాండ్ గట్టిగానే పెరుగుతోంది. కంటెంట్ అనేది బలంగా ఉంటే స్టార్స్ ఎవరు అనే దానితో సంబంధం లేకుండా ఎగబడి చూసేస్తున్నారు.
By: Tupaki Desk | 17 Sept 2025 3:40 PM ISTతెలుగు సినిమాకి విదేశీ మార్కెట్ లో కూడా డిమాండ్ గట్టిగానే పెరుగుతోంది. కంటెంట్ అనేది బలంగా ఉంటే స్టార్స్ ఎవరు అనే దానితో సంబంధం లేకుండా ఎగబడి చూసేస్తున్నారు. ఇక అమెరికా బాక్సాఫీస్‌లో ప్రతి పెద్ద సినిమా హంగామా సృష్టించడం కొత్తేమీ కాదు. అక్కడి తెలుగు ప్రేక్షకులు మొత్తం తెలుగు సినిమాలకు అద్భుతమైన సపోర్ట్ ఇస్తుంటారు. ఇక ఆ సపోర్ట్ తో మన హీరోలకు మిలియన్ రికార్డుల లెక్క పెరుగుతోంది. ఆ లిస్టులో ఇప్పుడు ఒక యంగ్ హీరో పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.
‘హనుమాన్’తో ఊచకోత కోసిన తేజ సజ్జా, ఇప్పుడు ‘మిరాయ్’తో మళ్లీ కొత్త రికార్డులు రాస్తున్నాడు. కేవలం ఐదు రోజుల్లోనే మిరాయ్ అమెరికా బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేయడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. వరుసగా రెండు సినిమాలతో 2 మిలియన్ క్లబ్‌లోకి చేరిన తేజ సజ్జా, టాలీవుడ్‌లోని పెద్ద స్టార్ హీరోల సరసన నిలిచాడు. సాధారణంగా ఈ స్థాయి వసూళ్లు ప్రబాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యాయి. కానీ ఇప్పుడు తేజ సజ్జా కూడా ఆ లిస్టులో చేరడం ఒక అద్భుతమైన ఘనత.
ఈ విజయానికి కారణం కేవలం హైప్ మాత్రమే కాదు, కథలోని ప్రత్యేకత. సూపర్ హీరో కాన్సెప్ట్, అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ కంటెంట్ మిరాయ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గ్రాఫిక్స్‌తోపాటు టెక్నికల్‌గా ఇచ్చిన ప్రెజెంటేషన్, మనోజ్ మంచు విలన్‌గా చూపిన ఎనర్జీ కలిపి సినిమా విజయాన్ని మరింత బలంగా నిలబెట్టాయి.
ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నట్లు, మిరాయ్ విజయంతో తేజ సజ్జా తనకంటూ పాన్-ఇండియా మార్క్ సృష్టించాడు. గతంలో హనుమాన్‌తో ఓ రికార్డ్ అందుకున్న ఆయన, ఇప్పుడు మిరాయ్‌తో మరోసారి అంతే రేంజ్‌లో ఊచకోత కోశాడు. ఇది కేవలం ఓ యంగ్ హీరోకే కాకుండా, మొత్తం తెలుగు సినిమాకి ఒక గర్వకారణం అని చెప్పాలి.
ఇక నార్త్ అమెరికా మార్కెట్‌లో తెలుగు స్టార్ హీరోలు సాధించిన 2 మిలియన్+ రికార్డులు ప్రస్తుతం ఇలా ఉన్నాయి:
ప్రబాస్ - 7
మహేష్ బాబు - 5
ఎన్టీఆర్ - 5
చిరంజీవి - 3
అల్లు అర్జున్ - 3
రామ్ చరణ్ - 3
నాని - 3
పవన్ కళ్యాణ్ - 2
వెంకటేష్ - 2
వరుణ్ తేజ్ - 2
తేజ సజ్జా - 2*
మొత్తం మీద, తేజ సజ్జా వరుసగా రెండు 2 మిలియన్ గ్రాసర్లు ఇవ్వడం ద్వారా టాలీవుడ్‌లో రాబోయే సూపర్ హీరోగా తన స్థాయిని నిరూపించుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో మిరాయ్ ఇంకా ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.
