డీమోంటే కాలనీ-3 లో టాలీవుడ్ యంగ్ హీరో!
`జాంబీరెడ్డి`, `హనుమాన్` లాంటి విజయాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించు కున్నాడు తేజ సజ్జా.
By: Tupaki Desk | 5 Jun 2025 1:00 AM IST`జాంబీరెడ్డి`, `హనుమాన్` లాంటి విజయాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించు కున్నాడు తేజ సజ్జా. వైవిథ్యమైన కాన్సెప్ట్ లతో సక్సెస్ ఫార్ములా తెలిసిన నటుడిగా తనని తాను డిజైన్ చేసుకుని ముందుకెళ్తున్నాడు. `హనుమాన్` విజయంతో ఏకంగా పాన్ ఇండియాలోనే సత్తా చాటాడు. రెగ్యులర్ కమర్శియల్ చిత్రాలకు భిన్నంగా తేజ చేస్తోన్న ప్రయత్నాలే అతడిని మంచి స్థానంలో కూర్చో బెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్క్రిప్ట్....డైరెక్టర్ సెలక్షన్ అన్నింటా తన పత్యేకత చాటుతున్నాడు. ప్రస్తుతం `మిరాయ్` అనే సినిమా పాన్ ఇండియాలో చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో భారీ హిట్ కొడతాడనే అంచనాలున్నాయి. మరో యూనిక్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందు కొస్తు న్నాడన్నది అర్దమవుతుంది. ఈసినిమా విజయం సాధిస్తే తేజ పాన్ ఇండియా ఇమేజ్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల కథలు, దర్శకుల విషయంలోనూ అంతే కేర్ పుల్ గా ఉన్నాడు. ఇప్పటి వరకూ ఏ స్క్రిప్ట్ అధికారికంగా లాక్ చేయలేదు గానీ, కోలీవుడ్ హారర్ థ్రిల్లర్ సంచలనాన్ని రంగంలోకి దించుతున్నట్లు తెలిసింది. డీమోంట్ కోలనీతో అజయ్ జ్ఞాన ముత్తుకు దర్శకుడిగా మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచాడు.
అటుపై నయనతార తో ఓ సినిమా విక్రమ్ తో `కోబ్రా` సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు.గత ఏడాది రిలీజ్ అయిన `డీమోంటీ కాలనీ 2` తో మరోసారి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం `డీమోంటే కాలనీ 3` చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తోనే సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇటీవలే తేజ సజ్జా? అజయ్ జ్ఞానముత్తును కలిసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్త లొస్తున్నాయి.
దీంతో ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తేజ ఇలాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తాడని చెప్పాల్సిన పనిలేదు. మరి ఇదే నిజమైతే ఓ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా? లేక డీమోంటే కాలనీ 3 లో ఏదైనా కీలక రోల్ కు తేజ పేరును పరిశీలిస్తున్నారా? అన్న డౌట్ కూడా రెయిజ్ అవుతుంది.
