Begin typing your search above and press return to search.

ప్రియుడితో తీన్ మార్ బ్యూటీ ఫుల్ జోష్

పాపుల‌ర్ నిర్మాత ర‌మౌష్ తౌరాణీ ఇంట్లో జ‌రిగిన ఈ వేడుక‌లో ఇత‌ర సెల‌బ్రిటీల‌తో పాటు పుల్కిత్- కృతి జంట సంద‌డి చేసారు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 5:32 AM GMT
ప్రియుడితో తీన్ మార్ బ్యూటీ ఫుల్ జోష్
X

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న తీన్ మార్, సుమంత్ స‌ర‌స‌న బోణి చిత్రాల్లో న‌టించింది కృతి స‌నోన్. ఆ త‌ర్వాతా టాలీవుడ్ లో బిగ్ కెరీర్ ని ఆశించినా అది సాధ్య‌ప‌డ‌లేదు. ప‌రాజ‌యాలు ఇబ్బంది పెట్టాయి. కానీ ఈ బ్యూటీ క‌న్న‌డ రంగంలో వ‌రుస అవ‌కాశాలు అందుకుంది. బాలీవుడ్ లోను అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు అందుకుంటూ కెరీర్ బండిని లాగించేస్తోంది.

అయితే కెరీర్ కంటే ఈ బ్యూటీ నిరంత‌రం లవ్ లైఫ్ విష‌య‌మై హెడ్ లైన్స్ లోకి వ‌స్తోంది. పుల్కిత్ సామ్రాట్ అనే న‌టుడు కం మోడ‌ల్‌తో కృతి త‌న డేటింగ్ ని అధికారికం చేసింది. ఈ జంట షికార్ల‌పై నిరంత‌రం బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది. ఇప్పుడు మ‌రోసారి దీపావ‌ళి ఈవెంట్లో ప్రియుడితో ప్ర‌త్య‌క్ష‌మై కృతి హాట్ టాపిక్ గా మారింది. పాపుల‌ర్ నిర్మాత ర‌మౌష్ తౌరాణీ ఇంట్లో జ‌రిగిన ఈ వేడుక‌లో ఇత‌ర సెల‌బ్రిటీల‌తో పాటు పుల్కిత్- కృతి జంట సంద‌డి చేసారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

క‌ర్భంధ కెరీర్ జ‌ర్నీ:

అందాల కృతి క‌ర్భందా కెరీర్ జ‌ర్నీని ప‌రిశీలిస్తే డ‌జను పైగా చిత్రాల్లో న‌టించింది. 2016లో `రాజ్ రీబూట్`తో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేయడానికి ముందు, కృతి ఖర్బందా సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస చిత్రాలు చేసింది. అనేక యాడ్ ఫిల్మ్‌లలో కనిపించిన తర్వాత 2009లో సుమంత్ సరసన `బోని` అనే తెలుగు చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి ప్రతికూల స్పందన లభించినా కానీ కృతి అంద‌చందాలు న‌ట‌న‌కు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది.

బ్రూస్ లీ- ది ఫైటర్ (2015)

రామ్ చరణ్‌తో తన మొదటి చిత్రంలో, కృతి అత‌డికి సోదరి పాత్రలో నటించింది. `ఒంగోలు గీత`, `మిస్టర్ నూకయ్య`, `బెల్లి`, `తిరుపతి ఎక్స్‌ప్రెస్`, `మాస్తి గుడి, మరియు `మించాగి నీ బరాలి` వంటి చిత్రాలలో నటించింది.

గూగ్లీ (2013)

KGF తో పాన్-ఇండియా స్టార్ గా మారడానికి చాలా కాలం ముందు నటుడు యశ్‌ను పాపులర్ చేసిన సిఇమా గూగ్లీ. ఇందులో కృతి క‌థానాయిక‌. ప్రేమలో శరత్ -స్వాతి కొన్ని అపార్థాల కారణంగా విడిపోయిన త‌ర్వాత ఏం జ‌రిగింద‌నే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. వారు కొన్ని సంవత్సరాల తర్వాత స్నేహితుడి పెళ్లిలో తిరిగి కలిసాక క‌థ మ‌లుపులు తిరుగుతుంది.

తీన్ మార్ (2011)

ఆమె తొలి తెలుగు చిత్రం అద్భుతాలు చేయనప్పటికీ పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ లో క‌థానాయిక‌గా న‌టించింది. 40 ఏళ్ల క్రితం ప్రేమకథ .. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రేమ గురించి పునరాలోచించుకునే వ్యక్తి కథతో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో వసుమతి పాత్రలో కృతి నటించింది.

చిర్రు (2010)

ఈ సినిమాతో కృతికి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. ఇది కన్నడలో ఆమె తొలి చిత్రంగా గుర్తించబడింది. ఈ చిత్రంలో చిరంజీవి సర్జా క‌థానాయ‌కుడు. కృతి నాయిక‌గా మెప్పించింది.

ప్రేమ్ అడ్డా (2012)

ఈ సినిమా కోసం కృతి తొలిసారిగా డి-గ్లామ్ పాత్రలో నటించింది. ఆమె అప్పటి వరకు తాను పోషించిన అత్యంత ఛాలెంజింగ్ క్యారెక్టర్‌గా గిరిజ పాపుల‌రైంది. ఎందుకంటే దానికి మేకప్ లేని లుక్, టాన్ తో చెప్పులు లేకుండా నడవడం వంటి అంశాల‌తో `రా లుక్`లో క‌నిపించింది. ఈ సినిమా కోసం ఆమె తన తల్లితో పాటు తన కాస్ట్యూమ్స్ ను స్వ‌యంగా డిజైన్ చేసుకుంది.

సూపర్ రంగ (2014)

జీవితంలో థ్రిల్స్‌ని కోరుకునే రంగా అనే యువకుడి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. అతను స్వాతితో ప్రేమలో పడతాడు. కానీ అతడు కోరుకున్న థ్రిల్‌ను ఇంకా కోల్పోతాడు. స్వాతి అప్పుడు ఒక పోలీసు అధికారిని వివాహం చేసుకుంటుంది. ప్రేమికుడు ఈ ప‌రిస్తితిని ఎదుర్కోవటానికి రహస్య అవతార్ లోకి మార‌తాడు. కృతి న‌ట‌న‌కు పేరొచ్చింది.