Begin typing your search above and press return to search.

విజ‌య్ ఆంటోని కూతురిపై స్కూల్ టీచ‌ర్లు చెప్పిన నిజాలు

ఈ వీడియోను విజయ్ ఆంటోని భార్య ఫాతిమా షేర్ చేశారు. స్కూల్ ఫంక్షన్‌లో చిత్రీకరించిన వీడియో ఇది ఈ వీడియోలో మీరా తెల్లటి యూనిఫాం ధరించి, చీరకట్టుతో కనిపించింది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 4:12 PM GMT
విజ‌య్ ఆంటోని కూతురిపై స్కూల్ టీచ‌ర్లు చెప్పిన నిజాలు
X

త‌మిళ హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోనీ చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని మ‌ర‌ణించ‌డంతో ఈ వార్త మొత్తం ఇండస్ట్రీని కుదిపేసింది. మీడియా కథనాల ప్రకారం.. మీరా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మీరా ఒత్తిడితో పోరాడుతోందని మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. డిప్రెష‌న్ ఈ తీవ్రమైన చర్యకు ప్రధాన కారణమని చెబుతున్నారు.

మీరా దురదృష్టకర మరణానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా ట్వీట్లు, పోస్ట్ లు వైర‌ల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ క్లిష్ట దశలో విజ‌య్ ఆంటోని, అతని కుటుంబానికి మద్దతునిస్తున్నారు. ఇప్పుడు మీరా ఆంటోనీ తన స్కూల్ డేస్‌లోని పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను విజయ్ ఆంటోని భార్య ఫాతిమా షేర్ చేశారు. స్కూల్ ఫంక్షన్‌లో చిత్రీకరించిన వీడియో ఇది ఈ వీడియోలో మీరా తెల్లటి యూనిఫాం ధరించి, చీరకట్టుతో కనిపించింది. వీడియో ప్రకారం.. మీరా పాఠశాలలో ఒక నిర్దిష్ట విభాగానికి కార్యదర్శిగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నట్లు కనిపించింది. మీరా పాఠ్యేతర కార్యక్రమాలతో చాలా చురుగ్గా ఉండేదని స్పష్టమైంది. వీడియోను షేర్ చేస్తూ ఫాతిమా ఇలా రాసింది. ఈ దీవెనలన్నింటికీ ధన్యవాదాలు ప్రభువు.. మేము అనర్హులం.. మీ ప్రేమ గొప్పది... మీరా విజయ్ ఆంటోనీకి అభినందనలు అని హార్ట్ - హగ్స్ ఎమోజీలను షేర్ చేసింది.

మీరా మరణం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఇది అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదైంది. చిన్నారి మీరా తీవ్ర చర్య వెనుక ఉన్న క‌చ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు మీరా ఉపాధ్యాయులు - స్నేహితులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మీరా మొబైల్ ఫోన్‌ను కూడా పరిశీలిస్తున్నారు. మీరా చివ‌రి కాల్ ఎవ‌రికి వెళ్లింది? ఎవ‌రి నుంచి మెసేజ్ వ‌చ్చింది? వంటి వివ‌రాల‌పైనా కూపీ లాగుతున్నారు.

స్కూల్ లోను విషాదం:

మీరా మరణంతో ఆమె చదువుకొనే స్కూల్‌లో కూడా విషాదం నెలకొంది. స్కూల్ టీచర్లు, సహ విద్యార్థులు విష‌ణ్ణ‌వ‌ద‌నాల‌తో మీరాకు సంతాపం తెలిపారు. మీరాకు చ‌దువు ప‌రంగా ఒత్తిడి లేదు. త‌ను మేధావి కాక‌పోయినా తెలివైన అమ్మాయే. త‌న‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. చ‌దువు గురించి ఒత్తిళ్లు అస‌లే లేవు అని స్కూల్ టీచ‌ర్లు తెలిపారు. ఇంత చిన్న‌వ‌య‌సులో ఇలాంటి తీవ్ర నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌ల‌చివేసింద‌ని టీచ‌ర్లు బాధను వ్య‌క్తం చేసారు. అయితే మీరా లావుగా ఉన్నాననే అంత‌ర్మ‌ధ‌నంతో ఉండేది. ఇతర పిల్లలను చూసి ఆత్మనూన్యతాభావంతో బాధపడేది. కానీ ఇది మీరా ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం కాదు అని కూడా టీచ‌ర్లు అన్నారు.