Begin typing your search above and press return to search.

విజయ్​పై టీడీపీ ఎంపీ ప్రశంసలు.. అల్లుకున్న అనుమానాలు!

ఈ చెక్‌ను శ్రీకాకుళం తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆ పాపకు అందించి.. ఈ సందర్భంగా వీడియో బైట్ ద్వారా విజయ్‌ దేవరకొండపై ప్రశంసలు కురిపించారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 12:29 PM GMT
విజయ్​పై టీడీపీ ఎంపీ ప్రశంసలు.. అల్లుకున్న అనుమానాలు!
X

సినిమా తీశామా, బ్లాక్ బస్టర్ కొట్టామా, వందల కోట్ల క్లబ్‌లో చేరిపోయామా, మార్కెట్​ పెంచుకున్నామా.. అని కాకుండా చాలా మంది టాలీవుడ్​ హీరోలు తమ వంతుగా ఏదో ఒక సాయం చేసి మంచి మనసును చాటుకుంటుంటారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. తనకు వచ్చిన మొత్తంలో.. కొంతైనా తమ అభిమానుల కోసమో, పేద ప్రజల కోసమో ఖర్చుపెడుతూ.. సేవాగుణాన్ని చాటుకుంటుంటారు రౌడీ హీరో.

అలా ఇటీవలే ఖుషి సినిమా సక్సెస్​ అవ్వడం వల్ల.. తన రెమ్యూనరేషన్‌లో రూ. కోటి రూపాయాలను 100 కుటుంబాలకు ఇవ్వాలని విజయ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలా తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాలు పోగొట్టుకున్న షర్మల శ్రీ అనే చిన్నారికి రూ.లక్ష అందించారు.

ఈ చెక్‌ను శ్రీకాకుళం తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆ పాపకు అందించి.. ఈ సందర్భంగా వీడియో బైట్ ద్వారా విజయ్‌ దేవరకొండపై ప్రశంసలు కురిపించారు. అయితే తెదేపా ఎంపీ.. విజయ్​పై ప్రశంసలు కురిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పలు అనుమానాలకు దారీ తీస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తన జిల్లాలోని విజయ్​ ఫ్యాన్స్​ను తెదేపా వైపు తిప్పుకోవడం కోసం ఎంపీ రామ్మోహన్​ నాయుడు ఇలా ప్రశంసలు కురిపించారని అంటున్నారు. మరికొందరు అలా కాదని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని మాజీ తెదేపా నాయకులు(ప్రస్తుతం బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లో ఉన్నవారు​).. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలా ఆంధ్రకు చెందిన తేదేపా ఎంపీ విజయ్​పై ప్రశంసలు కురిపించడం, తెలంగాణకు చెందిన నాయకులు తేదేపాకు సపోర్ట్ ఇవ్వడం.. అలా వీటన్నింటికీ మధ్య ఏమైనా లింక్ ఉందా? అనే ప్రశ్నలకు దారీ తీస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇక విజయ్​ సినిమాల విషయానికొస్తే.. ఫ్యామిలీస్టార్‌లో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్. రీసెంట్​గా రిలీజ్ చేసిన ఈ సినిమా గ్లింప్స్‌లోని డైలాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.